Pawan Kalyan : డీలిమిటేషన్‌పై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
- డీలిమిటేషన్‌పై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
- 50% నియోజకవర్గాల పెంపుపై హర్షం
- ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని సూచన
- జనసేనలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JLP సమావేశంలో డీలిమిటేషన్ అంశంపై స్పందించారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. డిలిమిటేషన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ ప్రక్రియలో ప్రజా ప్రయోజనమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని… పునర్విభజనలో వాస్తవిక దృక్పథం అవసరమని పవన్ స్పష్టం చేశారు. 2009లో జరిగిన పునర్విభజన అనుభవాలను గుర్తు చేసుకోవాలని సూచించారు. నిబంధనలకు అనుగుణంగా, సహేతుకంగా ఈ ప్రక్రియజరగాలన్నారు.ప్రజాప్రతినిధులు అన్ని వర్గాలకు చేరువగా ఉండాలని… నియోజకవర్గాల్లో దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని దిశానిర్దేశం చేశారు.
Hyderabad Rain: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. రోడ్లన్నీ జలమయం
Also Read
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు గణనీయంగా పెరుగుతాయని… ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలను 50 శాతం పెంచడం హర్షణీయమని పేర్కొన్నారు. 88 అసెంబ్లీ, 12 వరకు పార్లమెంట్ సీట్లు పెరిగి… దాదాపు 100 మందికి కొత్త అవకాశాలు లభిస్తాయని తెలిపారు.ఈ ప్రక్రియ ఎక్కడా దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని స్పష్టం చేసిన పవన్… డీలిమిటేషన్‌పై పార్టీ ఎలా ముందుకు వెళ్లాలి, ఎలాంటి కార్యాచరణ ఉండాలన్నదానిపై సూచనలు చేసేందుకు ఎమ్మెల్యేలతో కమిటీ ఏర్పాటు చేయాలని పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌కు సూచించారు.కమిటీ నివేదిక ఆధారంగా జనసేన డీలిమిటేషన్‌పై తన కార్యాచరణను ఖరారు చేసుకోనున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..