Pawan Kalyan Delhi Tour: ఢిల్లీలో జనసేనాని.. ఇద్దరు కీలక నేతలతో భేటీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan Delhi Tour: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ బాట పట్టారు.. ఇప్పటికే హస్తిన చేరుకున్న ఆయన.. భారతీయ జనతా పార్టీలో కీలకంగా ఉన్న నేతలను కలవబోతున్నారు.. ప్రతిపక్షాలపై అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని ఇటీవల ప్రకటించిన పవన్.. ఇప్పుడు అందుకే ఢిల్లీ వెళ్లారా? అనే చర్చ సాగుతోంది.. అయితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ మధ్య హస్తిన వెళ్లివచ్చారు.. తన పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం అయ్యారు.. దీంతో.. జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్ పై ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.
Read Also: Twitter Blue Tick: మస్క్ కీలక నిర్ణయం.. వారికి ఫ్రీగా ట్విట్టర్ బ్లూటిక్.. వీరికి మాత్రం షాక్..!
Also Read
- Vangalapudi Anitha: రోడ్డెక్కడం కాదు.. అసెంబ్లీకి రావాలి.. వైసీపీకి అనిత సూచన
- YS Jagan Slams AP PPP Policy: ‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’లా కొత్త PPP పాలసీ.. జగన్ తీవ్ర విమర్శలు
- YS Jagan: ‘డీఎస్సీలో పనిచేసే ఉద్యోగికే ఫస్ట్ ర్యాంక్’.. లోకేష్ రాజీనామా చేయాల్సిందే.. జగన్ సంచలన వ్యాఖ్యలు
- YS Jagan: ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అపాయింట్‌మెంట్ పవన్ కల్యాణ్‌కు ఖరారు అయినట్టు తెలుస్తోంది.. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. ఆ ఇద్దరు కీలక నేతలతో సమావేశం కానున్నారు.. పవన్ ఢిల్లీ టూర్ తో మరోసారి రోడ్ మ్యాప్ ఎపిసోడ్ తెరపైకి వచ్చింది.. తెలంగాణ రాజకీయాలపైనా ఢిల్లీ పెద్దలతో చర్చించే అవకాశం ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి.. పవన్ వెంట ఢిల్లీ వెళ్లారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. కాగా, బీజేపీ, జనసేన పొత్తుపై పలు సందర్భాల్లో క్లారిటీ ఇచ్చారు పవన్ కల్యాణ్.. బీజేపీతో పొత్తులో ఉన్నామన్న ఆయన.. ఈ మధ్య టీడీపీకి కూడా అనుకూలంగా ఉన్నామనే సంకేతాలు ఇచ్చారు. మరోవైపు, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత జనసేనతో పొత్తు ఉన్నా లేనట్టేనని.. పవన్ కల్యాణ్ నుంచి సరైన సహకారం అందలేదంటూ ఏపీ బీజేపీలో కీలక నేతలు వ్యాఖ్యానించడం పెద్ద దుమారమే రేపింది.. ఇలాంటి సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
NTR : ఎన్టీఆర్‌కు సర్జరీ..కిమ్స్ ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల
-
Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మకు షాక్.. విచారణ కమిటీ సంచలన రిపోర్ట్
-
Tollywood : ఈమధ్య సినిమాలు ఫ్లాప్ అవడానికి కారణమిదేనా?
-
PM Modi: ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..‘‘మీరు మారిపోయారు’’ అని ఖర్గే కౌంటర్..
-
Independence Day 2026: యుద్ధాలు.. జనాభా మార్పులు..! మన ముందు తరాలు చూడబోయే భారతావని ఎలా ఉండబోతోంది?
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..