Pawan Kalyan : విజయ్’ని మనసారా అభినందిస్తున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల (పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి) ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. ఓటర్ల చైతన్యాన్ని అభినందిస్తూ, ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే శిరోధార్యమని ఆయన పేర్కొన్నారు. నాలుగు రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో వెలువడిన ఎన్నికల ఫలితాలు ఓటర్ల విజ్ఞతను చాటుతున్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటారని, పాలన నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా మార్పును ఆహ్వానిస్తారని ఈ ఫలితాలు నిరూపించాయని ఆయన అభిప్రాయపడ్డారు.పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ సాధించిన విజయంపై పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా స్పందించారు. బెంగాల్ ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన కృషి శ్లాఘనీయమని కొనియాడారు. మోదీ నాయకత్వంలో బెంగాల్ సురక్షితంగా, సుభిక్షంగా ఉంటుందని ప్రజలు నమ్మారని, అందుకే బీజేపీకి పట్టం కట్టారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మోదీ, అమిత్ షా, నితిన్ నబిన్, సువేందు అధికారికి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
అసోం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ వరుసగా విజయాన్ని అందుకున్న ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మకి అభినందనలు తెలిపారు. పుదుచ్చేరిలో ఎన్.డి.ఎ. కూటమికి మళ్ళీ విజయాన్ని అందించిన ముఖ్యమంత్రి రంగసామిని అభినందించారు. తమిళనాడులో చోటు చేసుకున్న రాజకీయ మార్పు గురించి పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరో విజయ్ స్థాపించిన టి.వి.కె. పార్టీకి తమిళ ప్రజలు బ్రహ్మరథం పట్టారని, పార్టీ స్థాపించిన అనతి కాలంలోనే ఇంతటి ఘనవిజయం సాధించడం గొప్ప విషయమని విజయ్ ని మనసారా అభినందించారు. కేరళ ప్రజలు కూడా ఈసారి మార్పునే కోరుకున్నారని, అక్కడ విజయం సాధించిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూ.డి.ఎఫ్. (UDF) కూటమికి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.
Also Read
- OTR: విశాఖ మేయర్ సీటు కోసం వారసులు పోటీ ? మరి దక్కేదెవరికి ?
- Kurnool High Court Bench: కర్నూలులో హైకోర్టు బెంచ్.. మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు
- AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
- YS Jagan: మెగా డీఎస్సీపై జగన్ సంచలన ఆరోపణలు.. అర్హత లేనివారికి ఉద్యోగాలా?
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!