Pawan Kalyan: 115 మంది జనసైనికులపై హత్యాయత్నం కేసులు.. హైకోర్టుకు వెళ్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరాంధ్ర గర్జన నేపథ్యంలో మంత్రులపై జరిగిన దాడి ఘటనలో అరెస్ట్‌అయినవారిని స్టేషన్ బెయిల్ ఇప్పించి బయటకు తీసుకొచ్చామని చెబుతున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. 13 మంది మినహా మిగతా అందిరికీ స్టేషన్ బెయిల్ వచ్చిందన్నారు.. ఇక, తన విశాఖ పర్యటనలో ఆంక్షలపై ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేనాని.. ఇలాంటి ఆంక్షలు మళ్లీ విధించకుండా ప్రభుత్వాన్ని నియంత్రించేలా పోరాటం చేసేందుకు ఆయన సిద్ధం అవుతున్నారు. దీనిపై న్యాయ నిపుణులతో చర్చించనున్నారు.. ఇది ప్రభుత్వంపై పోరాటమే తప్ప.. పోలీసులపై కాదని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్.
Read Also:Nama Nageswara Rao: ఎంపీ నామా నాగేశ్వరరావుకి ఈడీ షాక్.. ఆస్తులు జప్తు
Also Read
- Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
- Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
- Rajamahendravaram: గోదావరిలో హౌస్‌బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
- Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
విశాఖ నుంచి విజయవాడ బయల్దేరే సమయంలో.. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. 115 మందికిపైగా జనసైనికులను అరెస్ట్‌చేశారు.. వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, 12 మందిని రిమాండ్‌కు పంపారు.. చాలా మందికి మా లీగల్ టీమ్ కష్టపడి బెయిల్ ఇప్పించింది… మిగతావారికి కూడా బెయిల్ ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.. దీనిపై హైకోర్టుకు కూడా వెళ్తామన్నారు జనసేనాని.. మా పోరాటం పోలీసులపై కాదు.. ప్రభుత్వంపై పోరాటమని ప్రకటించారు.. తనను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారని.. తాను తిరుగు ప్రయాణం అయిన సమయంలో.. కనీసం అభివాదం చేసేందుకు కూడా అవకాశం ఇవ్వలేదన్నారు.. నా అభిమానులు, జనసైనిలు చేసిన అభివాదాలకు.. నేను ప్రతిగా అభివాదాలు చేసే పరిస్థితి లేదంటే.. అది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంక్షల వల్లే అన్నారు.. ఇలాంటి ఆంక్షలు భవిష్యత్‌లో విధించకుండా ఉండేందుకు పోరాటం చేస్తామన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!