Double Murder Case: అజ్ఞాతంలోకి పిన్నెల్లి బ్రదర్స్..? డబుల్ మర్డర్ కేసులో పోలీసుల గాలింపు..
- పల్నాడు డబుల్ మర్డర్ కేసులో దర్యాప్తు ముమ్మరం..
- పిన్నెల్లి సోదరుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు..
- ముందస్తు బెయిల్ రాకమందే అరెస్ట్ చేసే యోచన..
- డబుల్ మర్డర్ కేసులో ఇప్పటికే ఆరుగురి అరెస్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Double Murder Case: పల్నాడు జిల్లాలో వెల్దుర్తి మండలం గుండ్లపాడులో TDP నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు సోదరులు దారుణ హత్యకు గురయ్యారు. 15 రోజుల క్రితం వీళ్లను కారుతో గుద్ది చంపారు ప్రత్యర్థులు. ఈ కేసులో గుండ్లపాడుకు చెందిన జవిశెట్టి శ్రీను, తోట వెంకట్రామయ్య, గురవయ్య, దొంగరి నాగరాజు, తోట వెంకటేశ్వర్లు, గెల్లిపోగు విక్రమ్ లను అరెస్ట్ చేశారు పోలీసులు.
Read Also: Hyderabad: సీఎం రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. 65 వేల కొత్త ఆటో రిక్షాలకు అనుమతి
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- CM Chandrababu: రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వివాహితపై అత్యాచారం..
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
ఈ కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ7గా ఉన్నారు. అలాగే, 8వ నిందితుడు పిన్నెల్లి వెంకట రామిరెడ్డి, తొమ్మిదో నిందితుడు పిన్నెల్లి వెంకట రెడ్డిని చేర్చారు పోలీసులు. ప్రస్తుతం వీరు ముగ్గురు అజ్ఞాతంలో ఉన్నారు. దీంతో వాళ్ల కోసం గాలిస్తున్నారు పోలీసులు. జంట హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి సోదరులు ప్రయత్నిస్తున్నారు. దీంతో బెయిల్ వచ్చే లోపే వాళ్లను అరెస్టు చేయాలనే పట్టుదలతో ఉన్నారు పోలీసులు.
Read Also: Indian Railway: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక నాన్ ఏసీ కోచ్‌లలోనూ ఏసీ కోచ్‌ల సౌకర్యాలు..!
కాగా, టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావుల హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించిన విషయం విదితమే.. వారిపై 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ప్రత్యక్ష సాక్షి, మృతుల బంధువు తోట ఆంజనేయులు ఫిర్యాదు మేరకు… ఏ1గా జవిశెట్టి శ్రీను ఎలియాస్ బొబ్బిలి, ఏ2గా తోట వెంకట్రామయ్య, ఏ3గా తోట గురవయ్య, ఏ4గా దొంగరి నాగరాజు, ఏ5గా తోట వెంకటేశ్వర్లు, ఏ6గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఏ7గా పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలపై కేసులు నమోదు చేశారు వెల్దుర్తి పోలీసులు. అయితే, మే 24న ఓ శుభకార్యానికి బైక్‌పై వెళ్లి వస్తున్న టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావులను వెల్దుర్తి మండలం బోదిలవీడు సమీపంలో ప్రత్యర్థులు కారుతో ఢీకొట్టి.. రాళ్లతో మోది హత్యచేసి పారిపోయిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
-
Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
-
US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
-
Film Federation: ఫెడరేషన్ అధ్యక్షుడిపై విమర్శలపై 23 క్రాఫ్ట్స్ సీరియస్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?