Perni Nani: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరి పాలన చూస్తుంటే ప్రజలు భయబ్రాంతులకు గురౌతున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని అన్నారు. ప్రతి వర్గంలో అభద్రతాభావం, భయం నెలకొన్నాయి.. వైద్య రంగాన్ని ప్రైవేట్ పరం చేయటానికి చంద్రబాబు వెంపర్లాడుతున్నారు.. వైద్యాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే సామాన్యులకు వైద్యం అందే పరిస్థితి ఉంటుందా అని ప్రశ్నించారు. భారతదేశం మొత్తం కూడా విద్య, వైద్యం ప్రభుత్వం చేతిలో ఉండాలనే కోరుకుంటున్నారు.. ప్రజల అభీష్టం ఏంటో కూడా తెలుసుకోక పోవడం దౌర్భాగ్యం అన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకి సామాన్యులపై దృక్పథం మారటం లేదని విమర్శించారు. మొదటిసారి ముఖ్యమంత్రిగా పని చేసిన జగన్ ను చూసి చంద్రబాబు మారాల్సింది.. కానీ, ఆయనలో ఏ మార్పు రాలేదన్నారు. విద్యా వ్యవస్థలో పెను మార్పులు తెచ్చేందుకు జగన్ కృషి చేశారని పేర్నినాని పేర్కొన్నారు.
అయితే, చంద్రబాబు ఏదైనా అంటే పీపీపీ అంటాడు.. లేదా నాలుగు పీపీపీపీలు అంటాడు అని మాజీ మంత్రి పేర్నినాని ఎద్దేవా చేశారు. ఆ పీపీపీలతో ఎవరు బాగుపడ్డారని ప్రశ్నించారు. గవర్నమెంట్ ఆస్పత్రులను తీర్చిదిద్దుతామని చెప్పి ఇదా మీరు చేసింది?.. ఆస్పత్రుల ప్రైవేటీకరణతో ఎవరికి దోచిపెడతారు అని క్వశ్చన్ చేశారు. ఆస్పత్రుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి మందికి పైగా సంతకాలు చేశారు.. అందులో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన వారు కూడా ఉన్నారని పేర్నినాని వెల్లడించారు.
