NTV Telugu Site icon

Buddha Venkanna: రేపు మాచర్ల వస్తా దమ్ముంటే అడ్డుకోండి.. బుద్ధా వెంకన్న సవాల్

Budda Venkanna

Budda Venkanna

నరసరావుపేటలో పల్నాడు ఎస్పీని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రేపు మాచర్ల వస్తా దమ్ముంటే అడ్డుకోండి అంటూ సవాల్ చేశారు. రేపు మాచర్లకి నేను ఒక్కడినే వెళ్లి డీఎస్పీని కలవబోతున్నా.. దమ్ముంటే రేపు నాపై దాడి చేయండని అన్నారు. గతంలో మాచర్ల మున్సిపల్ ఎన్నికల సమయంలో తమపై జరిగిన దాడి గురించి ఎస్పీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. మాచర్ల మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు వేయనివ్వకుండా వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారని పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి తాను, బోండా ఉమా మాచర్ల వెళ్ళామని చెప్పారు.

Read Also: Hyderabad: పట్నంలో పల్లెటూరి వాతావరణం.. ఘనంగా సంక్రాంతి వేడుకలు..

ఆ సందర్భంలో పిన్నెల్లి సోదరులు.. వేలంపాట పెట్టి వచ్చిన వారిని ఎవరు చంపుతారు, వారికి లైఫ్ సెటిల్మెంట్ అని పిలుపునిచ్చారని బుద్ధా వెంకన్న తెలిపారు. వేలం పాటలో తురకా కిషోర్ అనే వ్యక్తి తమను చంపేందుకు ముందు వచ్చాడని అన్నారు. వెదురు బొంగుతో తమపై దాడి చేసి చంపేందుకు ప్రయత్నించాడు.. తమ నాయకుడు ధైర్యంతో, దేవుడి ఆశీస్సులతో తాము బయట పడ్డామని బుద్ధా వెంకన్న తెలిపారు. తమపై దాడిలో పాల్గొన్నది తురకా కిషోర్ అయితే.. దాడి చేయించింది పిన్నెల్లి సోదరులని ఆరోపించారు. వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేసుని ఎవరు పట్టించుకోలేదని చెప్పారు.

Read Also: Bullet Bike: బుల్లెట్ బైక్ అమ్మేశారని బాలుడు ఆత్మహత్య..

ఇప్పుడు ఉన్న ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఎంతో నిజాయితీపరుడు.. తురకా కిషోర్ ని అరెస్ట్ చేయడంలో ఎస్పీ కీలక పాత్ర పోషించారని బుద్ధా వెంకన్న తెలిపారు. ఈ కేసులో పిన్నెల్లి సోదరులు తప్పించుకునేందుకు హై కోర్టులో ముందస్తు పిటిషన్ వేశారన్నారు. మీరు ఆషామాషీ వ్యక్తులతో పెట్టుకోలేదు.. బుద్దా వెంకన్న లాంటి వ్యక్తితో పెట్టుకున్నారని అన్నారు. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు.. మీకు శిక్షలు పడే వరకు తాను పోరాడుతూనే ఉంటానని చెప్పారు. పిన్నెల్లి పై హైకోర్టులో ప్రైవేట్ కేసు కూడా వేయబోతున్నాను.. ముందస్తు బెయిల్‌ను రద్దుచేసే విధంగా పోరాడతానని బుద్ధా వెంకన్న తెలిపారు.

Show comments