ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రకంపనలు కలిగిస్తోంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కాంపై మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ప్రస్తుత పరిణామాలు వివరించేందుకు సమావేశం ఏర్పాటు చేశాం.. 32 జోన్లలో వ్యాపారాలు చేసే అందరిపై ఈడీ సోదాలు జరిగాయి.. రాజకీయంగా కేంద్రంలో జరిగే విషయాలతో మాకు సంబంధం లేదు.. ఢిల్లీ లిక్కర్ వ్యవహారం వ్యాపార దాడి గానే చూస్తున్నాం..దేశంలో ఏ రెడ్డి వ్యాపారం చేసినా మాగుంట శ్రీనివాసులురెడ్డి అంటున్నారు..ఢిల్లీలో జరిగిన వ్యాపారంలో నాకు, మా అబ్బాయికి ప్రత్యక్షంగా ఎటువంటి సంబంధం లేదు..
నేను ఎంపీని కాబట్టే రాజకీయ రంగు పులుముకుంది..ఢిల్లీ మద్యం స్కామ్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు…మా తండ్రి హయాం నుండి లిక్కర్ వ్యాపారం చేస్తున్నాం..ఢిల్లీలో 32 జోన్లు ఉంటే మా బంధువులు రెండు జోన్లలోనే వ్యాపారం చేశారు. నేను మా అబ్బాయి ఢిల్లీ లిక్కర్ బిజినెస్ లో డైరెక్టర్లుగా లేము. మా ఇల్లు ఆఫీసులో సోదాలు చేసిన ఈడికి అనుమానాలు నివృత్తి చేశాం అన్నారు. మా దగ్గర నుండి ఈడీ అధికారులు ఎలాంటి డాక్యుమెంట్లు తీసుకువెళ్ళ లేదు. మద్యం వ్యాపారం చేసిన అందరి ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేశారు.
Read Also: Delhi liquor scam: ED conducts search తెలుగు రాష్ట్రాల్లో లిక్కర్ స్కాం ప్రకంపనలు
ఢిల్లీ లో ఉన్న కొంత మంది నా వ్యక్తిత్వం పై కావాలని దాడి చేశారు. లిక్కర్ స్కామ్ పై సిబిఐ, ఈడి దర్యాప్తు చేస్తున్నాయి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం. ఢిల్లీలో మద్యం వ్యాపారం చేసిన వాళ్లందరూ నష్టపోయారు. మద్యం స్కాంపై దర్యాప్తు చేస్తున్న ప్రభుత్వ సంస్థలను మేం తప్పు పట్టం. ఢిల్లీ మద్యం స్కామ్ వ్యవహారం లో మాగుంట కుటుంబానికి నష్టం జరిగింది…మాకు ఎలాంటి రాజకీయ అడ్డంకులు లేవు. మా అబ్బాయి రాఘవరెడ్డి 2024 లో ఒంగోలు నుండి పోటీ చేస్తారని శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.
Read Also: Key Treatment For Knee Problems: కీళ్ల జబ్బుకి కీలక చికిత్స. ఒక్క ఇంజెక్షన్ ఖరీదు లక్షా పాతిక వేలు