Vangaveeti Radha: జనసేన కార్పొరేటర్లకు సన్మానం.. బెజవాడ అభివృద్ధిపై వంగవీటి రాధా కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vangaveeti Radha: ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో ఆత్మీయ అభినందన సభ ఘనంగా నిర్వహించారు. విజయవాడలో జనసేన పార్టీ తరఫున విజయం సాధించిన కార్పొరేటర్లను ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణతో పాటు జనసేన పార్టీ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ.. విజయవాడ ప్రజలు పార్టీలకు అతీతంగా తమను గెలిపించారని తెలిపారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, నగర అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. విజయవాడలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడమే తన లక్ష్యమన్నారు. నగర అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవసరమైన నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని మేయర్ వెల్లడించారు. విజయవాడ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోనూ అభివృద్ధి పనులు చేపడతామని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను మాట్లాడుతూ.. విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ పేరును ప్రకటించినప్పుడే ఆయన గెలుపు ఖాయమైందని అన్నారు. విజయవాడలో జనసేన పార్టీ అభ్యర్థులందరూ విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. నగరంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా కార్పొరేటర్లు పనిచేయాలని సామినేని ఉదయభాను సూచించారు. ప్రతి డివిజన్లో ప్రజా సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించినప్పుడే ప్రజాప్రతినిధులుగా గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజయం సాధించిన కార్పొరేటర్లను అభినందించి సత్కరించారు.
Also Read
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
- Budameru Floods: బుడమేరులో పెరిగిన వరద ఉద్ధృతి.. అప్రమత్తమైన అధికారులు..
- Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
తాజావార్తలు
-
Traffic Rules: పాత బైక్‌లు, కార్లతో రోడ్డుపైకి వస్తే వాహనాలు సీజ్.. బీఎస్-3, బీఎస్-4 వెహికల్స్ బ్యాన్!
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Vangaveeti Radha: జనసేన కార్పొరేటర్లకు సన్మానం.. బెజవాడ అభివృద్ధిపై వంగవీటి రాధా కీలక వ్యాఖ్యలు
-
India Unemployment Rate 2026: దేశంలో నిరుద్యోగం తగ్గుముఖం.. 5.1 శాతానికి పడిపోయిన నిరుద్యోగ రేటు!
-
Ramayana: ఆస్కార్ రేసులో ‘రామాయణ: పార్ట్ 1’.. ఇండిపెండెంట్ ఎంట్రీ!
ట్రెండింగ్
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
-
రోల్స్ రాయిస్‌కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!
-
New Zealand Test Squad: టీమిండియాతో టెస్ట్ సమరానికి కివీస్ రెడీ.. 14 మందితో జట్టు ప్రకటన!
-
National Education Day 2026: బట్టీ పద్ధతులకు చెక్.. ఏఐ యుగంలో ‘క్రిటికల్ థింకింగ్’
-
Kitchen Storage Tips : ఆవాలు ఎక్కువ కాలం తాజాాగా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే పాడవవు