TDP: తెలుగుదేశం పార్టీ నేతల మధ్య అంతర్గత క్రమశిక్షణ… టీడీపీ లో కట్టుబాట్లు ఎక్కువ అని నేతలు చెబుతూ ఉంటారు.. కానీ, వాస్తవ పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది.. గతంలో టీడీపీ నేతలు కొంత క్రమశిక్షణ తోనే ఉన్న పరిస్థితి.. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ నేతలు బాగా రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తోంది… ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేస్కోవడం.. పాలనా పరంగా.. రాజకీయంగా విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి వచ్చింది. తాజాగా తిరువూరు ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఎంపీ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్నారు కొలికలపూడి.. పదవులు అమ్ముకుంటున్నారు అన్నారు.. దీనిపై ఎంపీ కూడా ఘాటుగా స్పందించారు.. తను నిఖార్సయిన టీడీపీ కార్యకర్తను అంటున్నారు కేశినేని చిన్ని.. తనపై చేస్తున్న విమర్శలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు..
Read Also: Smriti Mandhana: ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన స్మృతి మంధాన!
ఒక గిరిజన మహిళ వివాదంతో మొదలైన ఘటన వీరి మధ్య వివాదానికి కారణం అయింది… టీడీపీలో ఉన్న అంతర్గత విభేదాల కారణంగా రచ్చ స్టార్ట్ అయింది.. ఇంకా కొన్ని జిల్లాలో ఎంపీ.. ఎమ్మెల్యే ల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఎంపీ బైరెడ్డి శబరి.. ఎమ్మెల్యే రాజ్ శేఖర్ రెడ్డి అంశం. కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి డైరెక్ట్ గా కౌన్సిల్ సమావేశంలో టీడీపీ నేతలపై విమర్శలు చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదే పదే చెబుతున్నా కూడా నేతలు ఇదే తరహా వైఖరి కొనసాగించడం.. తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది… పార్టీ లైన్ దాటి పోవద్దు అని చెప్తున్నా కూడా ఇదే లైన్ లో నేతలు ఉన్నారు.. దీంతో టీడీపీ అధిష్టానం.. తిరువూరుతో పాటు మరికొన్ని నియోజకవర్గాల నేతలను రేపు పార్టీ కార్యాలయానికి రమ్మని పిలిచినట్టుగా తెలుస్తోంది.. దీంతో అధిష్ఠానం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది హాట్ టాపిక్ అయింది.. అయితే, నాకు అధిష్టానం నుంచి ఎటువంటి పిలుపు లేదు.. నన్ను ఎవరు రేపు పార్టీ ఆఫీసుకి రమ్మని చెప్పలేదు అన్నారు ఎంపీ కేశినేని చిన్ని… నాపై ఎవరు ఆగ్రహం వ్యక్తం చేయలేదన్న ఆయన.. ఎమ్మెల్యే కొలికపూడిని రేపు అధిష్టానం రమ్మని చెప్పారేమో నాకు సమాచారం లేదన్నారు కేశినేని చిన్ని.. మరి ఎవరెవరిని టీడీపీ అధిష్టానం పిలిచింది.. ఎవరిపై చర్యలు తీసుకోనున్నారు అనేది రేపు తెలిసే అవకాశం ఉంది.