Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Minister Nara Lokesh Surprise Visit To Mylavaram School Midday Meal Quality Check

Minister Nara Lokesh: మైలవరం స్కూల్‌లో మంత్రి లోకేష్‌ ఆకస్మిక తనిఖీలు.. అధికారులకు సీరియస్‌ వార్నింగ్..

Published Date :March 17, 2026 , 3:15 pm
By Sudhakar Ravula
  • మైలవరం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి లోకేష్..
  • మధ్యాహ్న భోజనం నాణ్యత స్వయంగా పరిశీలన..
  • తప్పు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని అధికారులకు హెచ్చరిక..
  • విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల మెరుగుకు చర్యలు చేపట్టాలని ఆదేశం..
Minister Nara Lokesh: మైలవరం స్కూల్‌లో మంత్రి లోకేష్‌ ఆకస్మిక తనిఖీలు.. అధికారులకు సీరియస్‌ వార్నింగ్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Minister Nara Lokesh: ఎన్టీఆర్ జిల్లా, మైలవరం దేవునిచెరువు తారకరామా నగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల మధ్యాహ్న భోజనం బాగాలేదంటూ పాఠశాల హెచ్ఎం డ్రామా ఆడించిన ఘటన నేపథ్యంలో మంత్రి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తిని నాణ్యతను పరిశీలించారు. కొత్తగా ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్ అందిస్తున్న భోజనం నాణ్యతపై విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భోజనం బాగుందని విద్యార్థులు చెప్పారు. ఘటన జరిగిన రోజు, అంత‌కు ముందు భోజ‌నం ఎలా ఉంద‌ని విద్యార్థుల‌ను మంత్రి అడిగారు. భోజనం బాగాలేకపోతే ముందు తల్లిదండ్రులకు చెప్పాలని విద్యార్థులకు సూచించారు. ఆ తర్వాత భోజనం నాణ్యతపై లీప్ యాప్ ద్వారా తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకుంటామని చెప్పారు. ఇంకోసారి తప్పు జరగకుండా చూసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఇటీవల మధ్యాహ్న భోజనం సరిగా లేదంటూ ఆహారాన్ని విద్యార్థులు డస్ట్ బిన్ లో పడేసిన ఘటనపై సిబ్బందిని ఆరా తీశారు. భోజనం సిద్ధమయ్యాక ప్రతిరోజూ ఒక ఉపాధ్యాయుడు నాణ్యత పరిశీలిస్తున్నారా అని వాకబు చేశారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ప్రశ్నించారు.

తప్పు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవు
ఈ సందర్భంగా మంత్రి లోకేష్‌ మాట్లాడుతూ.. మీ పై పవిత్ర బాధ్యత ఉంది. చిన్న సమస్య ఉన్నా తెలుసుకోవాలి, పరిష్కరించాలి. త‌ప్పు పున‌రావృతం అయితే కఠిన చర్యలు తప్పవని, నిర్లక్ష్యంగా ఎవరూ వ్యవహరించవద్దని హెచ్చరించారు. భోజనం నాణ్యతపై ప్రతివారం తల్లిదండ్రులకు ఫోన్ చేయాలని, ఐవీఆర్ఎస్ ద్వారా వారి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలలో విద్యాబోధన తీరు, పాఠశాల పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. ప్రతి పాఠశాల తనకు ముఖ్యమేనని, అడ్మిషన్ల పెంపుతో పాటు విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల మెరుగుకు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం పాఠశాలలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని మంత్రి సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న ఆహారాన్ని, అంగన్ వాడీ కేంద్రం పరిశుభ్రతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

మైలవరం ఘటన నేపథ్యంలో విద్యార్థులకు అందే మధ్యాహ్న భోజనం పథకంపై ఇటీవల సమీక్షించిన మంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యంగా లేకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భోజనం సిద్ధమయ్యాక ప్రతిరోజూ ఒక ఉపాధ్యాయుడు నాణ్యత పరిశీలించాలని, బాగుందని నిర్థారించాకే విద్యార్థులకు పెట్టాలని ఆదేశించారు. వారంలో ఒకరోజు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో ఒక పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయాలన్నారు. భోజనం గురించి విద్యార్థులు చెబితే తల్లిదండ్రులు వెంటనే లీప్ యాప్ ద్వారా ఫిర్యాదులు, సూచనలు అందించాలని విజ్ఞప్తి చేశారు. సమూల మార్పు కోసం త్వరలోనే సెంట్రలైజ్డ్ కిచెన్ వ్యవస్థను యుద్ధప్రాతిపదికన ఏర్పాటుచేయాలని ఆదేశించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap education news
  • Government School Midday Meal
  • Lokesh Surprise Visit School
  • Midday Meal Scheme Andhra Pradesh
  • Mylavaram Latest News

తాజావార్తలు

  • KTR : 27 నెలలు అయిన PRC పత్తా లేదు.. ఇంకా 5 DAలు బాకీ..

  • Pawan Kalyan: ‘గాడ్ ఫాదర్’ డైరెక్టర్‌తో పవన్ కళ్యాణ్.. అంతా ఉత్తిదే!

  • Harish Shankar: ‘చిరంజీవికి పవన్ తమ్ముడు మాత్రమే కాదు.. కొడుకు కూడా’ : హరీశ్ శంకర్

  • RRB ALP Recruitment 2026: కృపయా ధ్యాన్ దే.. రైల్వేలో 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు.. 10th, ITI పాసైతే చాలు

  • Minister Nara Lokesh: మైలవరం స్కూల్‌లో మంత్రి లోకేష్‌ ఆకస్మిక తనిఖీలు.. అధికారులకు సీరియస్‌ వార్నింగ్..

ట్రెండింగ్‌

  • Viral News: నిమ్మకాయ జ్యూస్‌కి ‘గ్యాస్ ఛార్జ్‌’.. షాకైన కస్టమర్లు!

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions