NTV Telugu Site icon

NTR District: ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు బస.. లక్ష మందికి సరిపోయేలా ఆహారం..!

Chandrababu Cm

Chandrababu Cm

NTR District: విజయవాడలోని సింగ్ నగర్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో బస చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో వరదలు సాధారణ స్థితికి వచ్చేంత వరకు కలెక్టరేట్లోనే బస చేస్తానని సీఎం నిర్ణయించుకున్నారు. విజయవాడ కలెక్టరేట్‌లో సీఎం చంద్రబాబు మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పాలు, ఆహారం, నీళ్లు, కొవ్వొత్తులు, టార్చ్‌లు.. అన్ని ప్రాంతాల నుంచి వెంటనే తెప్పించాలని ఆదేశాలు జారీ చేశారు. లక్ష మందికి సరిపోయే ఆహారం సరఫరా చేయాలని పేర్కొన్నారు. అలాగే, అదనపు బోట్లు, ట్రాక్టర్లు తక్షణం తెప్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Read Also: Bangladesh: షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు: నివేదిక

ఇక సహాయక చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్ర చంద్రబాబు నాయుడు తెలిపారు. వృద్ధులు, పిల్లలను వరద ప్రాంతాల నుంచి తరలించాలని కోరారు. అన్ని షాప్‌ల నుంచి వాటర్ బాటిల్స్ తెప్పించాలన్నారు. ప్రతి ఒక్క బాధితుడికి సాయం అందించాలి.. అక్షయపాత్రతో పాటు ఇతర ఏజెన్సీల నుంచి ఆహారం తెప్పించాలని అధికారులకు సీఎం సూచనల చేశారు. ఖర్చు గురించి ఆలోచించకుండా పని చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.