CS Sameer Sharma : ఉక్రెయిన్‌లో ఉన్నవాళ్ల పూర్తి సమాచారం ప్రభుత్వం వద్ద లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్ సంక్షోభంపై రాష్ట్రంలో అత్యవసరంగా ఓ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని ఏపీ సీఎస్ సమీర్ శర్మ వెల్లడించారు. రహదారులు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తదితర ఉన్నతాధికారులు ఈ కంట్రోల్ రూమ్ బాధ్యతలు వహిస్తారని ఆయన తెలిపారు. 1902 నెంబర్ ద్వారా తల్లిదండ్రులు వారి పిల్లలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో విద్యార్ధులు మినహా ఇతర ప్రవాసాంధ్రులకు సంబంధించిన పూర్తి సమాచారం ప్రభుత్వం వద్ద లేదని ఆయన వెల్లడించారు. ఆ వివరాలను ఉక్రెయిన్ ఎంబసీ నుంచి, ఐబీ స్టాంపింగ్ కార్యాలయం నుంచి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్ధులు త్వరితగతిన వారికి సమీపంలో ఉన్న సరిహద్దు ప్రాంతాలను చేరుకుని విదేశాంగ శాఖ ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలని కోరుతున్నామన్నారు. హంగేరి సరిహద్దుల్లోని జహోరీ బోర్డర్ పోస్టు, పోలాండ్ సరిహద్దుల్లోని క్రాకోవీక్ సరిహద్దు, స్లోవాకియా, అలాగే రోమేనియా సరిహద్దుల్లో విదేశాంగశాఖ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. ఆయా కంట్రోల్ రూమ్ ల వద్ద భారత విదేశాంగ శాఖ అధికారుల బృందాలు భారతీయుల్ని సరిహద్దు దాటిస్తారన్నారు.
Also Read
తాజావార్తలు
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
-
Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
-
Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
-
Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!