విశాఖపట్నంలోని, రిషికొండలో చేపడుతున్న నిర్మాణాలపై వైసీపీ రెబల్ ఎంపీ రఘరామకృష్ణం రాజు వేసిన పిటిషన్ విచారించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) నలుగురు సభ్యుల కమిటీని నియమించింది. విశాఖపట్నం సమీపంలోని రుషికొండ పై చేపట్టిన నిర్మాణాలపై పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినట్లు వస్తున్న ఆరోపణలపై నివేదికను కోరింది. ఈ మేరకు ఎన్జీటీ గతంలోఇచ్చిన కోర్టు తీర్పును గుర్తు చేసింది. జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం డిసెంబర్ 17, 2021న జారీ చేసిన ఉత్తర్వులో, రుషికొండ పై…