TDP: మహిళా కమిషన్ ఎపిసోడ్‌లో ట్విస్ట్.. తెరపైకి కొత్త అంశం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో సామూహిక అత్యాచార ఘటన తర్వాత.. ఏపీ మహిళా కమిషన్ ఎపిసోడ్ వార్తల్లో నిలిచింది.. దీనికి కారణం.. పరామర్శల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ మధ్య జరిగిన వాగ్వాదం.. ఆ తర్వాత, ఆరోపణలు, విమర్శలు, నోటీసులు, ఆందోళనల వరకు వెళ్లింది.. తాజాగా, ఈ వ్యవహారంలో కొత్త అంశాన్ని తెర మీదకు తెచ్చారు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు.. బాధితుల గోప్యత పాటించే విషయంలో వాసిరెడ్డి పద్మే నిబంధనలను అతిక్రమించారంటూ ఆరోపించారు.. మహిళా కమిషన్ వాట్సాప్ గ్రూపులో బాధితులను ఓదారుస్తున్న వాసిరెడ్డి పద్మ విజువల్స్, ఫొటోలను మీడియాకు విడుదల చేశారన్నారు బోండా ఉమ.. వాటికి సంబంధించిన మహిళా కమిషన్ వాట్సాప్ గ్రూప్ స్క్రీన్ షాట్లను బయటపెట్టారు..
Read Also: Harish Rao : కేంద్రం మాటల్లో అచ్చే దిన్.. కానీ.. చేతల్లో సచ్చేదిన్..
Also Read
- Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
- AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
- AP Excise Policy 2026-27: కొత్త ఎక్సైజ్ పాలసీకి రంగం సిద్ధం.. 807 మద్యం దుకాణాలకు లాటరీ!
- Heavy Rains: బీభత్సం సృష్టిస్తున్న భారీ వర్షాలు.. నీట మునిగిన వందల ఎకరాల వరి పంట!
వాసిరెడ్డి పద్మ లేని అధికారాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తోందని ఆరోపించారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బోండా ఉమ.. తాడేపల్లి నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ను ఫాలో కావాలనుకుంటే తమ వద్ద కుదరదు.. వ్యక్తిగత గోప్యత గురించి మాట్లాడే హక్కు వాసిరెడ్డి పద్మకు లేదన్నారు.. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ అధికారిక వాట్సాప్ గ్రూపుల్లో బాధితురాలి.. బాధిత బంధువుల ఫొటోలు.. విజువల్స్ పెట్టింది నిజం కాదా..? అని ప్రశ్నించారు. పది కాదు.. దానికి 90 కలుపుకుని నాపై కేసులు పెట్టినా నేను భయపడేదే లేదన్నారు.. క్వాసి జుడిషీయరీ అధికారాలున్న మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌కు మాకు నోటీసులిచ్చే అధికారమే లేదన్నారు.. తాడేపల్లి నుంచి ఏదో రాసిచ్చారని.. వాసిరెడ్డి ఆ కాగితాన్ని చదివేశారని ఎద్దేవా చేశారు.. చంద్రబాబు వస్తున్నారు కాసేపు ఆగి రావాల్సిందిగా పోలీసులు కోరినా.. వాసిరెడ్డి పద్మ వినలేదని.. చంద్రబాబు వచ్చినా సరే నేనూ వస్తానంటూ పోలీసుల సూచనలను పట్టించుకోలేదని.. ప్రచారం కోసమే వాసిరెడ్డి పద్మ పాకులాడుతున్నారని ఫైర్ అయ్యారు బోండా ఉమ.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!