Kakani Govardhan Reddy : నెల్లూరులో వైసీపీ నేతలు రైతాంగ సమస్యలను ప్రస్తావిస్తూ ర్యాలీ నిర్వహించారు. అన్నదాతకు అండగా చేపట్టిన వైసీపీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, ఇతర నేతలు వీఆర్సీ సెంటర్‌కి చేరుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా బయల్దేరారు.
vaccine: మలేరియా రహిత దేశంగా.. త్వరలో వ్యాక్సిన్ విడుదల
జిల్లా జేసీకి వినతిపత్రం అందజేసిన వైసీపీ నేతలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు అందజేశామని గుర్తు చేశారు. కానీ, ప్రస్తుతం కేంద్రం నుంచి తీసుకొచ్చిన లక్షల టన్నుల యూరియా ఏమైందో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. 50 శాతం కంటే ఎక్కువ యూరియాను ప్రైవేట్ వ్యాపారులకు ఎందుకు ఇచ్చారో చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
యూరియా పంపిణీ వ్యవహారంలో రూ.200 కోట్ల స్కాం జరిగిందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇప్పటివరకు జిల్లాలో ఏర్పాటు చేయలేదని కాకాణి విమర్శించారు. గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం కాకుండా వ్యాపారులు లాభాలు పొందుతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు కమిషన్ల కోసమే నోట బనకచర్ల ప్రాజెక్ట్‌ను ప్రస్తావిస్తున్నారని కాకాణి ఆరోపించారు. ప్రజల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రాజెక్టులు తెరపైకి తెస్తున్నారని ఆయన విమర్శించారు.
Karnataka: కర్ణాటకలో ఈద్ మిలాద్ ర్యాలీలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు.. ముగ్గురు అరెస్ట్!
