కరోనా కల్లోలం సృష్టిస్తున్న సమయంలో.. ఓవైపు ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా బాధితులను పట్టిపీడిస్తున్నాయి.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్లు కూడా దొరకని పరిస్థితి.. అప్పుడే.. అందరికీ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య కనబడ్డాడు.. ఆయన తయారు చేసిన కరోనా మందును వేలాది మంది తీసుకున్నారు. కానీ, దీనిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.. ఓవైపు ఇంకా అధ్యయనం కొనసాగుతూనే ఉంది.. మరోవైపు.. ఆనందయ్య ఇచ్చిన మందు తీసుకున్నవారు చాలా మంది ఇతర అనారోగ్య సమస్యల బారినపడినట్టు…
అనందయ్య విషయంలో సీఎం వైఎస్ జగన్‌పై మెడికల్ మాఫియా ఒత్తిడి చేస్తుందనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయన్నారు మాజీ ఎంపీ హర్షకుమార్.. ఇక, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మరణాల సంఖ్యను దాచిపెట్టడం సరికాదని హితవు పలికిన ఆయన.. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో బులిటెన్ ప్రకారం 13 మంది చనిపోయినట్లు చూపించారు.. అదేరోజు జిల్లాలో 200 మందికి పైగా కోవిడ్ తో చనిపోయారని ఆరోపించారు.. ప్రస్తుతం ప్రజలు కరోనా గురించి భయపడటం లేదన్న ఆయన.. అమెరికాలో కరోనాతో చనిపోయిన…
కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు కోసం న్యాయపోరాటానికే దిగేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది.. ఇప్పటికే ఆనందయ్యకు వ్యతిరేకంగా కొంత.. అనుకూలంగా చాలా వరకు సోషల్ మీడియాలో మద్దతు లభిస్తుండగా.. వెంటనే ఆనందయ్య తయారు చేసిన కరోనా మందు పంపిణీ చేయాలంటూ.. అనంతపురానికి చెందిన ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు.. మరోవైపు.. ఆ మందు పంపిణీపై హైకోర్టులో మరో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది.. కరోనా బాధితులకు వెంటనే మందు పంపిణీ జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ పేర్కొన్నాడు..…
కరోనా విజృంభిస్తోన్న సమయంలో.. ఆనందయ్య కరోనా మందు పంపిణీ చేయడం.. దానిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేపట్టడంతో.. మందు తయారీ, పంపిణీ ఆగిపోయాయి.. అయితే, చాలా మంది ఆనందయ్యకు సపోర్ట్ చేస్తున్నారు.. ప్రభుత్వం వెంటనే ఆనందయ్యతో మందు పంపిణీ చేయించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.. మరోవైపు.. ఆనందయ్య ఆయుర్వేద మందు కొనసాగించాలని కోరుతూ.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు అయ్యింది… అనంతపురానికి చెందిన ఉమా మహేశ్వర నాయుడు అనే వ్యక్తి తరపున పిటిషన్ దాఖలు చేశారు…
కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేసిన కరోనా మందు పంపిణీకి నిన్ననే బ్రేక్‌లు పడ్డాయి… మళ్లీ ఎప్పటి నుంచి ప్రారంభం అయ్యేదానిపై ఇంకా క్లారిటీ లేదు.. మందు పంపిణీ నిలిపివేసిన కారణంగా ఎవరూ కృష్ణపట్నం రావొద్దని ఆనందయ్యతో పాటు.. స్థానిక ఎమ్మెల్యే కూడా కోరారు.. ఆనందయ్య మందుపై తుది నివేదిక వచ్చిన తర్వాతే మందు తయారు చేయడం గానీ, పంపిణీ గానీ ఉండే అవకాశంఉంది. ఇప్పటికే ఆయూష్ బృందం కృష్ణపట్నంలో మకాం వేయగా.. ఇవాళ ఆయూష్ టీమ్ పర్యవేక్షణలో…
అసలు కంటే.. కొసరు ఎక్కువట.. అసలు మందు ఇప్పటికే ఆపేశారు.. కానీ, ఇదే ఆ మందు అంటూ బ్లాక్ మార్కెట్‌లో సొమ్ము చేసుకోవడానికి బయల్దేరారు కేటుగాళ్లు.. విషయానికి వస్తే.. కరోనాకు ఆయుర్వేద మందుతో ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయారు కృష్ణపట్నం ఆనందయ్య.. ఇప్పుడు.. వార్తా కథనాలు మొత్తం ఆయన చుట్టే తిరుగుతున్నాయి.. మందులు ఏం వాడుతున్నారు దగ్గర నుంచి ఎలా తయారు చేశారు.. పంపిణీపై చర్చ సాగుతోంది.. ఇక, దీనిపై పూర్తిస్థాయిలో తేల్చేందుకు ఆయూష్ డిపార్ట్‌మెంట్‌కు కూడా రంగంలోకి…