కరోనా కల్లోలం సృష్టిస్తున్న సమయంలో.. ఓవైపు ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా బాధితులను పట్టిపీడిస్తున్నాయి.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్లు కూడా దొరకని పరిస్థితి.. అప్పుడే.. అందరికీ నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య కనబడ్డాడు.. ఆయన తయారు చేసిన కరోనా మందును వేలాది మంది తీసుకున్నారు. కానీ, దీనిపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.. ఓవైపు ఇంకా అధ్యయనం కొనసాగుతూనే ఉంది.. మరోవైపు.. ఆనందయ్య ఇచ్చిన మందు తీసుకున్నవారు చాలా మంది ఇతర అనారోగ్య సమస్యల బారినపడినట్టు…