Navy Day: విశాఖ సాగర తీరంలో నేవీ డే వేడుకలు.. నౌకాదళ విన్యాసాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Navy Day Celebrations At Vizag RK Beach: 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో భారత్ సాధించిన విజయ ఘట్టాన్ని పురస్కరించుకొని.. ప్రతీ ఏటా డిసెంబర్ 4వ తేదీన నేవీ డే పేరిట నౌకాదళ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాదిలో కూడా డిసెంబర్ 4న విశాఖ ఆర్కే బీచ్ వద్ద నేవీ విన్యాసాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచ్చేసి.. లాంఛనంగా నేవీ డే విన్యాసాలను ప్రారంభించారు. భారత నేవీ ప్రచురించిన ప్రత్యేక బ్రోచర్‌ను కూడా ఆమె ఆవిష్కరించారు.
తొలుత ఈ కార్యక్రమంలో భాగంగా నౌకాదళ సిబ్బంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి సింధువీర్ సబ్‌మెరైన్ ద్వారా స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి నేవీ డే విన్యాసాల్ని ప్రారంభించగా.. నేవీ సిబ్బంది అబ్బురపరిచే రీతిలో విన్యాసాల్ని చేపట్టారు. చేతక్ హెలికాప్టర్లతో త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ.. గగనవిహారం చేశారు. హెలికాప్టర్ నుంచి నేవీ మెరైన్ కమాండోలు జెమిని బోట్లలోకి దిగగా.. ఆ బోట్లు వేగంగా తీరానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా.. తీరంలో యాంటీ టెర్రరిస్టు ఆపరేషన్ నిర్వహించారు. విపత్కర పరిస్థితుల్లో శత్రుమూకలపై దాడి చేసే విన్యాసాలను ఈ ఆపరేషన్‌లో ప్రదర్శించారు. అంతేకాదు.. ఓ యుద్ధ నౌకలో కూడా మెరైన్ కమాండోలు విన్యాసాలు చేశారు.
Also Read
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
- Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
నేవీకి చెందిన మిగ్-29 యుద్ధవిమానాలు గగనతలంలోకి దూసుకెళ్లడం, యుద్ధ విమానం నుంచి వెలువడిన కాంతిపుంజాలతో ఆకాశం వెలిగిపోవడం, యుద్ధ నౌకలతో పాటు సబ్మెరైన్ల నుంచి రాకెట్ ఫైరింగ్ చేపట్టడం వంటివి అందరినీ ఆకట్టుకున్నాయి. ఏఎల్‌హెచ్ హెలికాప్టర్లు, అత్యాధునిక యూహెచ్బీ హెలికాప్టర్ల ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు కలిగివున్న అత్యాధునిక యుద్ధ విమానాలు కూడా విన్యాసాల్లో ప్రదర్శించారు. బోయింగ్ రేంజ్ పీఎస్ఐ విమానాల విన్యాసాలైతే.. ఈ ఈవెంట్లోనే ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. ఈ విన్యాసాలకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి విడదల రజని, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు హాజరయ్యారు.
ఇదిలావుండగా.. 1971లో పాకిస్తాన్, భారత్ మధ్య జరిగిన యుద్ధంలో విశాఖ నేవీ స్థావరం కూడా కీలక పాత్ర పోషించింది. తూర్పు తీరంలో ఉన్న భారత విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను నాశనం చేసేందుకు.. ఘాజీ అనే సబ్‌మెరైన్‌ని పాకిస్తాన్ పంపింది. అయితే.. అది లక్ష్యాన్ని చేరుకోవడానికి ముందే, విశాఖకు సమీపంలో ఘాజి సముద్ర జనాల్లో సమాధి అయ్యింది. ఆ విజయ ఘట్టాన్ని పురస్కరించుకొనే, ఈ నౌకాదళ విన్యాసాల్ని నిర్వహించడం జరుగుతోంది.
తాజావార్తలు
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!