Vizag: భారతదేశం - పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో విజయానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 4 న నేవీ డే జరుపుకుంటారు. విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది.
భారత నావికాదళం 2047 నాటికి ఆత్మనిర్భర్‌గా మారుతుందని ప్రభుత్వం హామీ ఇచ్చిందని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరి కుమార్ నేవీ డే సందర్భంగా శనివారం మీడియాతో వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి ఇటీవలి సంఘటనలు మన భద్రతా అవసరాల కోసం ఇతరులపై ఆధారపడలేమని నిరూపించాయని.. ఆత్మనిర్భర్‌గా ఉండటానికి ప్రభుత్వం చాలా స్పష్టమైన మార్గదర్శకాలను అందించిందని నేవీ చీఫ్ చెప్పారు.