విశాఖ గురించి ఏ మాత్రం పరిచయం ఉన్న వాళ్ళకైనా ఇక్కడ నీలి సముద్రం అందాలు సుపరి చితం. 35కిలోమీటర్ల తీరంలో బంగారపు రంగులో మెరిసిపోయే ఇసుక తిన్నెలు.. వాటిని బలంగా తాకే అలలు కనిపిస్తాయి. కానీ, రెండు రోజులుగా ఇక్కడ సముద్రం కొంత మేర రంగు మారింది. నల్లటి ఇసుక మేటలు వేస్తోంది. కోస్టల్ బ్యాటరీ నుంచి వుడా పార్క్ మధ్య తీరం నల్లగా మారడం తో సందర్శకులు అందోళనకు గురైయ్యారు.. నల్లటి ఇసుక కొట్టుకుని రావడం…