Site icon NTV Telugu

Nara Lokesh: ఉమామహేశ్వరి మరణంపై వైసీపీ విషప్రచారం

Lokesh 1 (2)

Lokesh 1 (2)

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు (Nandamuri taraka rama rao) కూతురు ఉమామహేశ్వరి బలవన్మరణంపై వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. చిన్నమ్మ ఉమామహేశ్వరి మరణంపై డోర్‌ నెంబర్ కి సర్వే నెంబర్ కి తేడా తెలియని కిరాయి గాళ్లతో జగన్ విష‌ప్రచారం చేయిస్తున్నారు. జ‌నాన్ని దోచి దాచుకుని, నెత్తుటి కూడు తింటూ, త‌ర‌త‌రాల‌ ర‌క్త‌చ‌రిత్రకి వార‌సుడు జ‌గ‌న్‌.

చిన్న‌మ్మ మ‌ర‌ణంతో మేము విషాదంలో వుంటే విష‌ప్ర‌చారం చేస్తూ వినోదం పొందుతారా? జగన్ (jagan mohan reddy) పైశాచిక ఆనందానికి ఎక్స్‌పెయిరీ డేట్ ద‌గ్గ‌ర ప‌డింది. చేస్తున్న పాపాలకు ఆ దేవుడి స్క్రిప్ట్ ప్రకారం శిక్ష అనుభవిస్తారు. కోడికత్తి డ్రామా, బాబాయ్ గుండెపోటు అంటూ ఆస్కార్ రేంజ్ న‌టన, ఒకే కులం డిఎస్పీలు 35 మందికి ప్ర‌మోష‌న్లు, పింక్ డైమండ్ పేరుతో ఇప్పటికే అస‌త్య విష‌ప్ర‌చారం చేశారు. అదే తరహాలో నేడు తప్పుడు సర్వే నెంబర్లు సృష్టించి నా చిన్న‌మ్మ ఉమామ‌హేశ్వ‌రి మ‌ర‌ణంపైనా విషప్రచారం చెయ్యబోయి బొక్కబోర్లా పడ్డారు.

తండ్రి శ‌వాన్ని అడ్డుపెట్టుకుని సీఎం కావాల‌ని సంత‌కాలు చేసిన నీచ చ‌రిత్ర జ‌గ‌న్‌ది అని మండిపడ్డారు. ఎన్నిక‌ల్లో సానుభూతి కోసం బాబాయ్ మ‌ర్డ‌ర్‌నీ వాడుకున్నారు. టెన్త్ క్లాస్ పేపర్లు కొట్టేసిన సైకో జగన్ తన క్రిమినల్ రూపాన్ని మరోసారి బయటపెట్టుకున్నారని లోకేష్ ఘాటైన విమర్శలు చేశారు.

Umamaheswari Funerals: నేడు ఉమమహేశ్వరి అంత్యక్రియలు.. మహాప్రస్థానంలో ఏర్పాట్లు

మరోవైపు ఎన్టీఆర్ తనయ ఉమా మహేశ్వరి మృతిపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తెలుగు యువత అధ్యక్షులు డా. పొగాకు జైరామ్ చందర్. బాధ్యుల్ని కనుగొని, వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

Exit mobile version