ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ విసిరారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించాలంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేయగలరా అంటూ సీఎం జగన్‌ను లోకేష్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘ఎన్డీయే అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నిక కావాలంటే వైసీపీ మద్దతు తప్పనిసరి అని ఏ2 సెలవిచ్చారు. స్పెషల్ స్టేటస్ సాధిస్తారని ప్రజలు 22 మంది ఎంపీలను ఇచ్చారు. ప్రత్యేక…