పిల్లల పెంపకంలో తల్లుల పాత్ర అత్యంత కీలకం అని నారా భువనేశ్వరి అన్నారు. చిన్నతనంలోనే విలువలు, సంస్కారం పిల్లలకు నేర్పాలని చెప్పారు. పిల్లల ఆసక్తిని గుర్తించి.. ఆ దిశగా ప్రోత్సహించాలని సూచించారు. తన కుమారుడు, మంత్రి నారా లోకేష్ ప్రజాసేవలో బిజీగా ఉండటంతో.. దేవాన్ష్ చదువు, క్రీడలను బ్రాహ్మణి చూసుకుంటోందన్నారు. గతంలో రాజకీయాల్లో బిజీగా ఉన్న చంద్రబాబు నాయుడు కారణంగా లోకేష్ పెంపకం బాధ్యత తాను తీసుకున్నాను అని భువనేశ్వరి చెప్పుకొచ్చారు. కుప్పం సామగుట్లపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ‘విలువల బడి’ కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొన్నారు.
Also Read: Vishva Hindu Parishad: క్షమాపణలు చెప్పకపోతే.. కచ్చితంగా రాజమౌళి సినిమాలు ఆపేస్తాం!
‘పిల్లలను విలువలతో పెంచాలి. విలువల బడి వ్యవస్థాపకుడు లెనిల్కు నా అభినందనలు. విద్యతో పాటు నైతిక విలువలు నేర్పడమే విలువల బడుల లక్ష్యం. స్కూళ్లలో ‘మోరల్ సైన్స్’ సబ్జెక్ట్‌ను పునరుద్ధరించిన మంత్రి నారా లోకేష్‌కి ప్రశంసలు చెబుతున్నా. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు క్లోజ్ బోర్డులు ఉండడం సంతోషకరమైన విషయం. టెక్నాలజీని చెడు కోసం వినియోగించే పరిస్థితి పెరుగుతుంది. పిల్లల పెంపకంలో తల్లుల పాత్ర అత్యంత కీలకం. చిన్నతనంలోనే విలువలు, సంస్కారం నేర్పాలి. పిల్లల ఆసక్తిని గుర్తించి ఆ దిశగా ప్రోత్సహించాలి’ అని నారా భువనేశ్వరి అన్నారు.
కుప్పం పర్యటనలో భాగంగా పరమసముద్రం KGBV పాఠశాల విద్యార్థులతో సమావేశం కావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. పిల్లల్లో దాగిఉన్న ఆత్మవిశ్వాసం, నేర్చుకునే తపన ఎంతో అభినందనీయం.
పట్టుదల, క్రమశిక్షణ ఉంటే ఏ విద్యార్థి అయినా ఉన్నత స్థాయికి చేరగలడని వారికి సూచించాను.
క్రీడల్లో రాణించే పిల్లలకు… pic.twitter.com/yzGN5uF7SB— Nara Bhuvaneswari (@ManagingTrustee) November 20, 2025