Srisailam Temple: చెంచులకు శుభవార్త చెప్పింది శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం.. శ్రీశైలంలో చెంచులకు ఉచితంగా మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనం కలిపించాలని నిర్ణయం తీసుకున్నారు.. చెంచు గిరిజనలకు ఉచిత స్పర్శ దర్శనం ప్రారంభించారు శ్రీశైలం ఆలయ బోర్డు ఛైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు.. శ్రీ మల్లికార్జున స్వామివారి స్పర్శ దర్శనం చేసుకున్నారు 100 మంది చెంచు గిరిజనులు.. ఇక, ఇప్పటి నుండి ప్రతి నెలలో ఒకరోజు చెంచు గిరిజనులకు ఉచిత స్పర్శ దర్శనం కల్పించనున్నట్టు దేవస్థానం అధికారులు చెబుతున్నారు.. గత ట్రస్ట్ బోర్డ్ సమావేశంలో చెంచు గిరిజనులకు స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు శ్రీశైలం ఆలయం చైర్మన్, సభ్యులు.. ఈ నిర్ణయానికి అనుగుణంగా.. ఇవాళ్టి నుంచి చెంచులకు ఉచితంగా మల్లన్న స్పర్శ దర్శనాన్ని కలిపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు..
Read Also: Komatireddy Venkat Reddy: హైదరాబాద్-విజయవాడ హైవేపై 8వ తేదీ నుంచి వాహన రద్దీ.. మంత్రి కీలక సూచనలు
ఈ సందర్భంగా శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ.. గత ట్రస్ట్ బోర్డు సమావేశంలో చెంచు గిరిజనులకు స్పర్శ దర్శనం కల్పించాలని సభ్యులు, అధికారులు కలిసి నిర్ణయించినట్లు తెలిపారు. ఈ హామీని నెరవేర్చడంలో భాగంగా.. ఇప్పటి నుంచి ప్రతి నెలలో ఒక రోజు చెంచు గిరిజనులకు ఉచితంగా స్పర్శ దర్శనం అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. అయితే, ఈ ఉచిత దర్శనం కేవలం నెలకు ఒక్కరోజు మాత్రమే అమల్లో ఉంటుందని, భక్తుల భద్రత, దర్శన క్రమశిక్షణ దృష్ట్యా సమయ పరిమితి పాటిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఆలయ దర్శనాల్లో చెంచు గిరిజనులకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించిన తొలి ట్రస్ట్ బోర్డుగా శ్రీశైలం దేవస్థానం నిలిచిందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. చెంచు గిరిజనుల సంక్షేమం, ఆధ్యాత్మిక భాగస్వామ్యాన్ని పెంచే దిశగా ఇది కీలక ముందడుగు అని తెలిపారు.