Site icon NTV Telugu

Srisailam Laddu Prasadam: శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక ఆరోపణల వెనుక కుట్రకోణం..!

Srisailam Laddu Prasadam

Srisailam Laddu Prasadam

Srisailam Laddu Prasadam: శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి ఆలయంలో పంపిణీ చేసే లడ్డూ ప్రసాదంలో బొద్దింక వచ్చిందంటూ ఆరోపణలు గుప్పుమన్నాయి.. అయితే, లడ్డూ ప్రసాదంలో బొద్దింక వచ్చిందన్న ఆరోపణల వెనుక కుట్రకోణం ఉందంటున్నారు ఆలయ ఈవో శ్రీనివాసరావు.. దీనిపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు తెలిపారు.. అంతేకాదు, శ్రీశైలం పోలీస్‌స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశారు.. దేవస్థానం సీసీ టీవీ ఫుటేజీ పరిశీలనతో ఆ కుట్రకోణం వెలుగులోకి వచ్చినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.. శ్రీశైలం దేవస్థానంపై దుష్ప్రచారం చేసేలా కుట్రకు పాల్పడ్డారని ప్రభుత్వానికి ఈవో నివేదిక ఇచ్చారు..

Read Also: Coolie : ఆ నలుగురిలో ముగ్గురు కలిసి కూలీని దించుతున్నారు!

అయితే, లడ్డూ ప్రసాదం విషయంలో కుట్రకు పాల్పడ్డ అంశంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది.. వెంటనే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.. సున్నితమైన అంశాల్లో రెచ్చగొట్టే విధంగా కుట్రలకు పాల్పడిన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాల్సిందిగా స్పష్టం చేసింది ప్రభుత్వం.. కుట్రలకు పాల్పడిన వారినే కాకుండా.. వారి వెనుక ఎవరున్నారనే అంశం పైనా ఆరా తీయాలని స్పష్టం చేసింది సర్కార్‌.. అయితే, లడ్డూ ప్రసాదంలో బొద్దికంటూ కుట్రపూరితంగా గొడవకు దిగాడట కావలికి చెందిన శరత్ చంద్ర.. ఈ కుట్రపై శ్రీశైలం పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈవో..

Read Also: Anupama Parameshwaran : అనుపమ సినిమా.. సెన్సార్ బోర్డు ఆఫీస్ ముందు నిరసన..

శ్రీశైలం ప్రసాదంలో బొద్దింక ఆరోపణలపై ఈవో శ్రీనివాసరావు.. ప్రభుత్వానికి అందించిన నివేదికలోని అంశాల విషయానికి వస్తే.. లడ్డూ ప్రసాదంలో బొద్దింక లేదు.. కావాలని ఓ మిడతను చొప్పించారు.. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన ద్వారా లడ్డూ ప్రసాదంలో బొద్దింక అంశం వెనుక కుట్ర ఉందని తేలిందని పేర్కొన్నారు.. లడ్డూలు కొనుగోలు చేసి అందులో మిడతను పెట్టినట్టు ఆధారాలు లభ్యమయ్యాయని.. మిడతను కలిపిన లడ్డూ ప్రసాదాన్ని చూపుతూ బొద్దింక వచ్చిందంటూ గొడవ పెట్టుకున్నట్టు గుర్తించామని ఈవో తెలిపారు.. ఫిర్యాదు చేసిన వ్యక్తి గొడవ పడుతుంటే అతనితో పాటు ఉన్న వేరే వ్యక్తులు సెల్ ఫోన్లల్లో రికార్డు చేశారు.. సెల్ ఫోన్లను ముందుగానే అందుబాటులో ఉంచుకోవడం.. ముందుగా ప్రసాదం కొనుగోలు చేసిన దాంట్లో మిడతను చొప్పించినట్టుగా సీసీ టీవీ కెమెరాల పరిశీలనతో అర్థమైంది దని ప్రభుత్వానికి నివేదిక పంపారు శ్రీశైలం ఈవో శ్రీనివాసరావు..

Exit mobile version