శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి ఆలయంలో పంపిణీ చేసే లడ్డూ ప్రసాదంలో బొద్దింక వచ్చిందంటూ ఆరోపణలు గుప్పుమన్నాయి.. అయితే, లడ్డూ ప్రసాదంలో బొద్దింక వచ్చిందన్న ఆరోపణల వెనుక కుట్రకోణం ఉందంటున్నారు ఆలయ ఈవో శ్రీనివాసరావు.. దీనిపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు తెలిపారు.. అంతేకాదు, శ్రీశైలం పోలీస్‌స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశారు.. దేవస్థానం సీసీ టీవీ ఫుటేజీ పరిశీలనతో ఆ కుట్రకోణం వెలుగులోకి వచ్చినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.. శ్రీశైలం దేవస్థానంపై దుష్ప్రచారం చేసేలా కుట్రకు పాల్పడ్డారని ప్రభుత్వానికి ఈవో నివేదిక ఇచ్చారు..