NTV Telugu Site icon

CM Chandrababu: సున్నిపెంటలో ప్రజా వేదిక సభ.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Cbn

Cbn

CM Chandrababu: శ్రీశైలం మల్లికార్జునస్వామిని దర్శించుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఆ తర్వాత శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించి.. కృష్ణా నదికి నది హారతి ఇచ్చారు.. అనంతరం సున్నిపెంటలో ప్రజా వేదిక సభలో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.. రాబోయే రోజులు అన్ని మంచి రోజులు ఉండాలని కోరుకుంటున్నాను అని ఆకాక్షించారు.. భ్రమరాంభ మల్లికార్జున స్వాముల వారిని దర్శించుకున్నా.. శ్రీశైలం జలాశయం జులై నెలలో నిండింది.. రాయలసీమలో కరువు లేకుండా చేయడం మన సంకల్పం కావాలి అన్నారు. కృష్ణా మిగులు జలాలని మనం వాడుకోవచ్చని చెప్పిన తొలి నాయకుడు ఎన్టీఆర్‌అని గుర్తుచేసిన ఆయన.. రాయలసీమకు నీళ్లిచ్చిన తర్వాతనే చెన్నై కి నీళ్లు వెళ్తాయని చెప్పిన నాయకుడు చంద్రబాబు అన్నారు. రాయలసీమలో పనికిరాని పార్టీకి 7 సీట్లు గెలిపించారు.. ఎక్కడో చిన్న లోపం ఉంది అన్నారు.

Read Also: IND vs SL ODI Series: హాట్‌స్టార్‌, జియోసినిమాలో రాదు.. ఫ్రీగా ఎలా చూడాలంటే?

ఇక, టీడీపీ హయాంలో 60 వేల కోట్లు ఖర్చు చేసాం.. కానీ, వైసీపీ హయాంలో 19 వేల కోట్లు ఖర్చు పెట్టారు అని విమర్శించారు చంద్రబాబు.. రాయలసీమలో మేం 12 వేల కోట్లు ఖర్చు చేస్తే, వైసీపీ కేవలం 2 వేల కోట్లు ఖర్చు చేశారు.. ఎవరి నుంచి ప్రజలకు ప్రయోజనం కలుగుతుందో గుర్తించాలని సూచించారు. వైసీపీ హయాంలో భయంతో బతికారు.. స్వేచ్ఛ లేదన్న ఆయన.. ఇప్పుడు ప్రజలకు టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వంలో స్వేచ్ఛ వచ్చింది.. సునామిలో వాళ్లు చిత్తు చిత్తుగా ఓడిపోయారని ఎద్దేవా చేశారు.. ఎన్నో హామీలు ఇచ్చాను.. నెరవేర్చాలి, ఖజానా ఖాళీగా ఉంది.. 2, 3 రోజుల్లో నాగార్జున సాగర్ నిండుతుంది, పులిచింతల కూడా నిండుతుందన్నారు. రాబోయే ఐదేళ్లు కరువు లేకుండా చేయాల్సిన బాధ్యత ఉంది. రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరివ్వాలి.. ఒకప్పుడు రాయలసీమ రతనాల సీమ.. కొందరు పాలకుల వల్ల రాళ్లసీమగా మారింది.. తిరిగి రతనాల సీమగా మారుస్తా అన్నారు.

Read Also: SC/ST Sub-Classification: ఏనాటికైనా ధర్మమే గెలుస్తుందని 2004లోనే చెప్పా: మంద కృష్ణ మాదిగ

మరోవైపు.. అన్ని పనులు చేస్తుంటే కొత్త బిక్షగాడు వచ్చాడు, ఏదో చేస్తాడని ఓట్లు వేస్తున్నారని ఫైర్‌ అయ్యారు చంద్రబాబు.. అడవి పందులు పంటలను తిని ధ్వంసం చేసినట్టు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని ఆరోపించారు.. అయితే, సంపద సృష్టించడంలో టీడీపీ ముందుంటుంది.. సంపద సృష్టిస్తా.. అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు చేరవేస్తా అన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..