సున్నిపెంటలో ప్రజా వేదిక సభలో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు.. రాబోయే రోజులు అన్ని మంచి రోజులు ఉండాలని కోరుకుంటున్నాను అని ఆకాక్షించారు.. భ్రమరాంభ మల్లికార్జున స్వాముల వారిని దర్శించుకున్నా.. శ్రీశైలం జలాశయం జులై నెలలో నిండింది.. రాయలసీమలో కరువు లేకుండా చేయడం మన సంకల్పం కావాలి అన్నారు. కృష్ణా మిగులు జలాలని మనం వాడుకోవచ్చని చెప్పిన తొలి నాయకుడు ఎన్టీఆర్‌అని గుర్తుచేసిన ఆయన.. రాయలసీమకు నీళ్లిచ్చిన తర్వాతనే చెన్నై కి నీళ్లు వెళ్తాయని…