శ్రీశైలం మల్లన్న ఆలయంలో ధనుర్మాసంలో వచ్చిన ఆరుద్రా నక్షత్రం సందర్భంగా శ్రీస్వామివారికి వార్షిక ఆరుద్రోత్సవం నిర్వహించారు.. ప్రతి నెలలో మాసోత్సవంగా నిర్వహిస్తుండగా, ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున మాత్రం వార్షిక ఆరుద్రోత్సవంగా నిర్వహించడం దేవస్థానానికి ఆనవాయితీగా వస్తుంది. నిన్నరాత్రి శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక లింగోద్భవకాల ఏకాదశ రుద్రాభిషేకం,అన్నాభిషేకం, బిల్వార్చన, పుష్పార్చన నిర్వహించి..