శ్రీశైలం మల్లన్న ఆలయంలో ధనుర్మాసంలో వచ్చిన ఆరుద్రా నక్షత్రం సందర్భంగా శ్రీస్వామివారికి వార్షిక ఆరుద్రోత్సవం నిర్వహించారు.. ప్రతి నెలలో మాసోత్సవంగా నిర్వహిస్తుండగా, ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున మాత్రం వార్షిక ఆరుద్రోత్సవంగా నిర్వహించడం దేవస్థానానికి ఆనవాయితీగా వస్తుంది. నిన్నరాత్రి శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక లింగోద్భవకాల ఏకాదశ రుద్రాభిషేకం,అన్నాభిషేకం, బిల్వార్చన, పుష్పార్చన నిర్వహించి..
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో గురువారం నాడు హుండీలను లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ట బందోబస్తు మధ్య సిబ్బంది, శివసేవకులు ఉభయ దేవాలయాలతో పాటు నిత్యాన్నదానం హాలులోని హుండీలను లెక్కించారు. గత 27 రోజులుగా స్వామి, అమ్మవార్లకు రూ.3,09,52,777 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో లవన్న తెలిపారు. అంతే కాకుండా 267 గ్రాముల బంగారం, ఐదు కిలోలకు పైగా వెండి ఆభరణాలు, 323 యూఎస్ డాలర్లు, 197 సౌదీ రియాల్స్, 137…
శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పారు అధికారులు.. కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో మార్పులు చేసుకోగా.. ఈ నెల 18 నుంచి స్వామివారి స్పర్శ దర్శనానికి భక్తులను అనుమతించనున్నట్లు ఈవో కేఎస్ రామారావు ప్రకటించారు.. ఇక, ప్రతిరోజు గర్భాలయంలో ఏడు విడతలుగా అభిషేకాలు, నాలుగు విడతలుగా సామూహిక అభిషేకాలు నిర్వహిస్తామని తెలిపిన ఆయన.. కోవిడ్ నేపథ్యంలో భక్తులను పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతించనున్నట్లు వెల్లడించారు. మరోవైపు.. అంతరాలయంలో భ్రమరాంబదేవికి ఆర్జిత కుంకుమార్చనలు జరుగుతాయని పేర్కొన్నారు.. వేదాశీర్వచనాలు, నవావరణ…