NTV Telugu Site icon

Naga Babu: మంత్రి రోజాకు నాగబాబు కౌంటర్.. ఆమె గురించి మాట్లాడటం అంటే..?

Naga Babu

Naga Babu

Naga Babu: జనసేన పీఏసీ సభ్యుడు నాగబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనసేన కార్యకర్తలను ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు. కార్యకర్తలు వలసలు పోకుండా ఆపాల్సిన బాధ్యత తమపై ఉందని నాగబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయాన్ని పార్టీ అధినేత ప్రకటిస్తారని.. పొత్తుల విషయాన్ని పార్టీ అధినేత ప్రకటిస్తారని తెలిపారు. అన్ని విషయాలు సమయం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తారని వివరించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందని.. కాంగ్రెస్ పార్టీ కాస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్‌గా మారిపోయింది కదా అని నాగబాబు అన్నారు.

Read Also: Sukesh – Nora Fatehi: డేటింగ్ చేయమని రోజుకి 10 సార్లు ఫోన్ చేసేది.. అవన్నీ అబద్ధాలు

జగన్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని.. అందుకే జీవో నంబర్ 1 తెచ్చిందని నాగబాబు విమర్శలు చేశారు. జగన్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలను అడ్డుకోవడానికి అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. మంత్రి రోజా గురించి మాట్లాడటం అంటే తమ స్థాయిని తగ్గించుకోవడమేనని నాగబాబు అభిప్రాయపడ్డారు. తమ ప్రచారాన్ని అడ్డుకుంటే.. వారాహిని ఆపితే నడిచి ప్రజల్లోకి వెళ్తామని స్పష్టం చేశారు. తాము ప్రస్తుతం బీజేపీతో కలిసే ఉన్నామని నాగబాబు చెప్పారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందో.. పాలన కూడా అలాగే ఉందని సెటైర్లు వేశారు. ప్రభుత్వం, అధికార పార్టీ నాయకులు ఎన్ని ఇబ్బందులు సృష్టించినా తాము చేయాల్సిన పని చేసి తీరతామన్నారు. సమావేశాలు నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం1ను జారీ చేస్తే.. హైకోర్టు మొట్టికాయ వేసిందని నాగబాబు గుర్తుచేశారు.