NTV Telugu Site icon

Naga Babu: పొత్తులపై నాగబాబు కీలక వ్యాఖ్యలు.. వైసీపీ నేతల్లా దిగజారి మాట్లాడలేం

Naga Babu

Naga Babu

Naga Babu: జనసేన నేత నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో ఆయన ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఎన్నికల్లో పొత్తులు లేకుండా ఉంటే అన్ని స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. అయినా పొత్తులపై నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్ కళ్యాణ్ చెప్పడం వెనుక ఏదో వ్యూహం ఉందని నాగబాబు అన్నారు. వైసీపీ విమర్శ అనేది దాటిపోయి తిట్టడం అనే కొత్త సంస్కృతి తెచ్చిందన్నారు. పవన్ కళ్యాణ్‌ను రాజకీయంగా విమర్శించొచ్చని.. కానీ వైసీపీలా దిగజారి తాము మాట్లాడలేమన్నారు. పవన్ కళ్యాణ్‌ను సీఎం చేయడమే తమ లక్ష్యమన్నారు. లైం లైట్‌లోకి రావడానికి తమను విమర్శిస్తున్నారని.. వారికి ఉపయోగపడుతుందంటే తిట్టనివ్వండి అంటూ నాగబాబు వ్యాఖ్యానించారు. తాము ప్రజలకు సేవ చేసే కృషిలో ఉన్నామన్నారు.

Read Also: NVSS Prabhakar: కేసీఆర్‌ కళ్లకి అద్దాలు పెట్టించి.. మోడీ అభివృద్ధిని చూపించాలి..

సింహం సింగిల్ వస్తుందనే సినిమా డైలాగులకు తాము స్పందించాల్సిన అవసరం లేదని నాగబాబు అన్నారు. జర్మనీని ఓడించడానికి అమెరికా , రష్యా వంటి దేశాలు కలిశాయని.. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము కూడా ఇతరులతో కలవాల్సి వస్తోందన్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది సస్పెన్స్ అన్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేయను.. పార్టీని పటిష్టం చేయడానికి పని చేస్తానని నాగబాబు చెప్పారు. 2019లో 7 శాతం ఓట్లు వచ్చిన జనసేన ఇప్పుడు 24 శాతానికి పెరిగిందని.. రాబోయే రోజుల్లో 40 శాతం వరకు పెరగొచ్చని అంచనా వేశారు. సంస్థాగత నిర్మాణం లేకపోవడం వల్ల జనసేనపై జనంలో అభిమానం, నమ్మకం ఉండదన్నది నిజం కాదని.. స్థాగత నిర్మాణం ఉన్న కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ కూడా ఎన్నికల్లో ఓడిపోయాయని నాగబాబు గుర్తుచేశారు.

Show comments