Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Nadendla Manohar Fires On Cm Ys Jagan

Nadendla Manohar: సినీ పరిశ్రమలో వేరేవాళ్లు లేరా..? ఇది పబ్లిసిటీ స్టంట్..

Published Date :February 11, 2022 , 4:57 pm
By Sudhakar Ravula
Nadendla Manohar: సినీ పరిశ్రమలో వేరేవాళ్లు లేరా..? ఇది పబ్లిసిటీ స్టంట్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలుగు సినీ ప్రముఖులు-ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ భేటీపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్… మంగళగిరిలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం వైఎస్‌ జగన్‌రెడ్డిది విచిత్ర ధోరణి.. కపట మనస్తత్వం అంటూ మండిపడ్డారు.. సమస్యను సృష్టిస్తారు… తానే పరిష్కరిస్తానని ప్రచారం చేసుకుంటారని ఎద్దేవా చేసిన ఆయన.. సినీ ప్రముఖుల్ని పిలిచి పబ్లిసిటీ స్టంట్ చేశారని సెటైర్లు వేశారు.. సినీ ప్రముఖుల పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించిన నాదెండ్ల… సినీ పరిశ్రమను విశాఖకు రమ్మని పిలుస్తున్న ముఖ్యమంత్రికి అమరావతి గుర్తుకు రాలేదా? అంటూ నిలదీశారు.

Read Also: Komatireddy: కొబ్బరికాయ కొట్టించిన కేసీఆర్‌.. ప్రశంసలు కురిపించిన కోమటిరెడ్డి..!

ఇక, సినిమా టిక్కెట్ల కోసం కేటాయించిన సమయాన్ని ప్రజా సమస్యల పరిష్కారం కోసం కేటాయించరా? అని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు నాదెండ్ల మనోహర్‌… సామాన్యుడి అర్జీకి సీఎం కార్యాలయం స్పందించే పరిస్థితి లేదని మండిపడ్డ ఆయన.. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వందల కోట్లు మాయం చేశారని ఆరోపించారు.. ఇక, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగత లబ్ధి కోసం మాట్లాడే వ్యక్తి కాదని స్పష్టం చేశారు మనోహర్‌.. ఇక, నిన్న జరిగిన సమావేశానికి అందరినీ ఆహ్వానించక పోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. సినిమా పరిశ్రమలో వేరే వాళ్లు లేరా? అని అని ప్రశ్నించారు.. అందరినీ ఎందుకు ఆహ్వానించరు అని నిలదీశారు.. నా దగ్గరికి తగ్గి వస్తేనే అనే ధోరణిలో సీఎం ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నాదెండ్ల మనోహర్‌.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chiranjeevi
  • CM YS Jagan
  • janasena
  • nadendla manohar
  • pawan kalyan

తాజావార్తలు

  • America Currency: 165 ఏళ్ల సంప్రదాయానికి ఫుల్ స్టాప్.. ఇక అమెరికా కరెన్సీపై ట్రంప్ సంతకం..

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • PM Modi: సీఎంలతో ముగిసిన మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!

  • PM Modi: “మోడీ గారు యుద్ధాన్ని ఆపండి”.. ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ విజ్ఞప్తి

  • Drone Smuggling: పంజాబ్ సరిహద్దుల్లో డ్రోన్ కలకలం.. రూ.2.5 లక్షల నకిలీ కరెన్సీ, 1.5 కిలోల హెరాయిన్ సీజ్!

ట్రెండింగ్‌

  • 120Hz డిస్‌ప్లే + 6300mAh బ్యాటరీ.. కేవలం రూ. 12,999లే.. కొత్త REDMI 15A 5G లాంచ్..!

  • Natural Remedy : మలబద్ధకానికి శాశ్వత పరిష్కారం.. ఇంట్లోనే రెడీ చేసుకోండి ఈ ‘మ్యాజికల్ డ్రింక్’

  • Weight Loss Tips : నెల రోజుల్లో పొట్ట తగ్గాలంటే.. రోజూ ఉదయాన్నే ఈ నీళ్లు తాగండి.!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, 50MP కెమెరా, 6500mAh భారీ బ్యాటరీతో TECNO Spark 50 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • Peddi Glimpse Review: ఆ బాడీ ఏంట్రా బాబు, అస్సలు ఊహించ లేదు.. ఇది అసలైన బర్త్‌డే ట్రీట్ చరణ్ అన్న!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions