విశాఖ వేదికగా 'సేనతో సేనాని' కార్యక్రమం నిర్వహిస్తున్నారు.. రెండురోజుల పాటు సాగిన ఈ సమావేశాలు.. ఇవాళ బహరంగసభతో ముగియనున్నాయి.. సేనతో సేనాని సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి క్రియాశీలక కార్యకర్తలు హాజరుకానున్నారు.. మధ్యాహ్నం 3 గంటలకు విశాఖ ఇందిరా ప్రియదర్శిని మైదానంలో సభ ప్రారంభం కానుండగా.. సాయంత్రం 6 గంటలకు పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు..
రేపు తిరుపతిలో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పర్యటించనున్నారు. మంగళంపేట అటవీశాఖ భూ అక్రమాలు విచారణలో సమయంలో నాగబాబు పర్యటన ఆసక్తి రేపుతోంది. కాగా.. ఫిబ్రవరి 2వ తేదీన పుంగనూరు నియోజక వర్గంలో ‘జనంలోకి జనసేన’ బహిరంగ సభ నిర్వహించనున్నారు. “జనంలోకి జనసేన సభ” పొలిటికల్ సర్కిల్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ కార్యక్రమానికి నాగబాబు హాజరవుతారు. సోమల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. తిరుపతి ఎమ్మెల్యే…
"ఇప్పటి వరకు అనకాపల్లి బెల్లం గురించే విన్నాం.. కానీ ఇప్పుడు అనకాపల్లి గుడ్డు గురించి వింటున్నా.. ఐదు శాఖల మంత్రి, డిప్యూటీ సీఎం, ప్రభుత్వ విప్ ఇచ్చినా కిలోమీటర్ రోడ్డు కూడా వేయించుకోలేక పోయారు.." అంటూ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. అనకాపల్లి వారాహి సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
నేను అధికారం కోసం కాదు.. మార్పు కోసం ఓట్లు అడుగుతాను అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. పార్టీ పెట్టి ప్రజల రుణం తీర్చుకుంటున్నాను.. యువత భవిష్యత్ కోసం పోరాడుతుంటే అవమానాలు, వెటకారాలు చేస్తున్నారు.. అయినా వాటిని భరించడానికి సిద్ధం అన్నారు. ఉత్తరాంధ్ర చైతన్యం కలిగిన నేల, అటువంటి చోట నుంచి వలసలు ఆగాలి అని ఆకాక్షించారు.
తన ఒంటిపై చేయి పడితే జనసేన ప్రభుత్వం వచ్చాక వైసీపీ గూండాలను ఇళ్లలోంచి లాక్కొచ్చి మరీ కొడతామని హెచ్చరించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలో జరిగిన వారాహి విజయ యాత్రలో ఆయన ప్రసంగిస్తూ.. తనకు జెడ్ కేటగిరి సెక్యూరిటీ అక్కర్లేదన్నారు.
జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా ఇప్పటం దగ్గర ఈనెల 14వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది.. ఇప్పటం వేదికగా.. పార్టీ కార్యాచరణను ప్రకటించబోతున్నారు పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. అయితే, సీఎం వైఎస్ జగన్ అహంకారానికి ప్రజల ఆత్మాభిమానానికి మధ్య జరుగుతున్న పోరాటమే ఈ సభగా అభివర్ణించారు జనసేన నేత నాదెండ్ల మనోహర్… జనసేన ఆవిర్భావ దినోత్సవం పండుగ వాతావరణంలో జరగనుంది అని వెల్లడించిన ఆయన.. దామోదరం సంజీవయ్య పేరుతో సభ ప్రాంగణం…