ఏపీలో టీడీపీ నేతలను కేసులు వెంటాడుతూనే ఉన్నాయి.. తాజాగా టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు మరికొందరు టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు కృష్ణాజిల్లా మైలవరం పోలీసులు.. సెక్షన్ 188 ఐపీసీ, 3 ఈడీఏ కింద కేసు నమోదు చేశారు.. అసలు కేసు ఎందుకు నమోదు చేశారనే విషయానికి వెళ్తే.. టీడీపీ పిలుపు మేరకు ఈ నెల 16వ తేదీన మైలవరంలో ఆందోళన నిర్వహించారు. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సహాయం ప్రకటించాలని, కరోనా మృతుల కుటంబాలకు రూ.10లక్షలు ఇవ్వాలని.. ఆక్సిజన్ కొరతతో మృతి చెందిన వారికి రూ.25లక్షలు పరిహారం ఇవ్వాలని, వ్యవసాయ ఉత్పత్తులన్నీ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, వైద్య సౌకర్యాలు విస్తృతం చేయాలన్న తదితర డిమాండ్లతో తహవీల్దార్‌కు వినతిపత్రాలు అందజేశారు.. అయితే, కరోనా మహమ్మారి సమయంలో.. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారంటూ కేసు నమోదు చేశారు పోలీసులు.
టీడీపీ నేత దేవినేనిపై కేసు నమోదు
Show comments