MVV Satyanarayana Again Gives Full Clarity On Kidnap Case: తన ఫ్యామిలీ కిడ్నాప్ ఘటనపై.. అలాగే రాజకీయ విమర్శలపై పూర్తి స్పష్టత ఇచ్చేందుకు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మరోసారి మీడియా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫ్యామిలీ కిడ్నాప్ పక్కా పథకం ప్రకారం జరిగిందని తెలిపారు. డబ్బుల కోసం నగరంలోని కొందరు ప్రముఖులకు సైతం కిడ్నాపర్లు ఫోన్ చేయించారని అన్నారు. రౌడీషీటర్ హేమంత్ పకడ్బందీగా వ్యవహరించడం వల్లే.. కిడ్నాప్‌పై ఎలాంటి అనుమానం రాలేదన్నారు. తన కుటుంబాన్ని, ఆడిటర్ జీవిని 24గంటలకు పైగా నిర్బంధించి.. వారికి చావును పరిచయం చేసిన రౌడీషీటర్ హేమంత్ గురించి మాట్లాడకుండా, ఇతర కారణాలపై చర్చలు చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కిడ్నాప్ వెనుక రాజకీయ కారణాలు, రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఏమీ లేవని స్పష్టతనిచ్చారు.
Pragya Jaiswal Hot Pics: ప్రగ్యా జైస్వాల్ పరువాల విందు.. యోగా చేస్తూ హాట్ స్టిల్స్!
ఐదేళ్ల తన ఫోన్ రికార్డ్స్ పరిశీలిస్తే.. హేమంత్‌తో తానెప్పుడూ మాట్లాడలేదనేది నిర్ధారణ అవుతుందని ఎంవీవీ చెప్పారు. నేరాలు అనేవి ఏ ప్రభుత్వంలోనైనా జరుగుతాయని.. అందరూ చెబుతున్నట్టుగా విశాఖలో నేరాలు, ఘోరాలు ఏమీ జరగడం లేదని అన్నారు. తనకు వైజాగ్ వదిలి వెళ్లిపోవాలనే ఆలోచనలు రావడానికి కారణం.. మీడియానేనని ఆరోపించారు. వందల అపార్ట్‌మెంట్లు కట్టినప్పుడు తనపై ఎలాంటి ఆరోపణలు లేవని.. కానీ ఎంపీ అయినప్పటి నుంచి తనని ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాలతో మనస్తాపానికి గురయ్యే.. వైజాగ్ వీడి పోవాలని భావించానన్నారు. బిల్డర్లు తనని ఒక రోల్ మోడల్‌గా భావిస్తోంటే.. మీడియా మాత్రం వక్రీకరిస్తోందని ఆరోపించారు. అధికార పార్టీ ఎంపీగా తన పనులు తాను చక్కబెట్టుకోగలననని.. ఎవరికో భయపడి పారిపోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. రఘు రామకృష్ణ రాజు ఓ గజ్జికుక్క అని విమర్శించారు.
Manipur: విశ్వాసం కోల్పోయామంటూ .. ప్రధాని మోదీకి మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యేల లేఖ
కిడ్నాప్ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని.. సీబీఐ విచారణకు ఆదేశిస్తే తాను సహకరిస్తా ఎంవీవీ డిమాండ్ చేశారు. 12వ తేదీ నుంచి కిడ్నాపర్లు పట్టుబడ్డ వరకు జరిగిన ఎపిసోడ్ మీద సమగ్ర విచారణ జరిపించాలని అడిగారు. ఎంపీకే రక్షణ లేదనే అంశాన్ని చంద్రబాబు, ఇతర నాయకులు రాజకీయం చేయడం తగదన్నారు. పవన్ కళ్యాణ్ బాగా మాట్లాడారు.. నాకు అధికారం ఉంటే ఎన్‌కౌంటర్ చేసేవాడిని అన్నారని గుర్తు చేశారు. ఇదిలావుండగా.. ఎంవీవీ సత్యనారాయణ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన ముఠాలో మరో 5 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ప్రధాన నిందితుడు హేమంత్‌తో పాటు రాజేష్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో ఐదుమందిని అదుపులోకి తీసుకున్నారు.