Agriculture Research Budget: వ్యవసాయపరిశోధనపై ఎందుకీ వివక్ష?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగంలో పరిశోధనకు బడ్జెట్‌లో కేటాయింపులను ఎందుకు పెంచడం లేదని వైసీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజ్యసభలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా వ్యవసాయ మంత్రిని అనుబంధ ప్రశ్న వేస్తూ 2021-22లో సవరించిన బడ్జెట్ అంచనాల ప్రకారం వ్యవసాయ పరిశోధనకు 8,514 కోట్ల కేటాయింపులు జరిగాయి. 2022-23 బడ్జెట్‌లో సైతం అంతే మొత్తం కేటాయించారు.
వ్యవసాయ పరిశోధనకు ఒక్క రూపాయి కూడా అదనంగా కేటాయించలేదు. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పుల వలన సంభవిస్తున్న అకాల వర్షాల వంటి సమస్యలతో ఏటా పంటలు నష్టపోతూ రైతాంగం కష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడే వంగడాలను అభివృద్ధి చేసేందుకు వ్యవసాయ పరిశోధనపై భారీగా ఖర్చు చేయవలసిన అవసరం ఉంది. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోందో వివరించాలని ఆయన ప్రశ్నించారు.
Ayodhya Ram Temple: అయోధ్య రామ మందిర ప్రారంభం అప్పుడే.. 40 శాతం పూర్తయిన పనులు
Also Read
- AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
దీనికి వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి జవాబిస్తూ వ్యవసాయ పరిశోధనను ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలోను విస్మరించబోదని చెప్పారు. పరిశోధనకు మరిన్ని నిధులు కావాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చి (ఐసీఏఆర్) కోరితే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. దేశంలో వ్యవసాయోత్పత్తుల పెరుగుదలతోపాటు వ్యవసాయ రంగానికి విద్యుత్ అవసరాలు కూడా పెరుగుతున్నాయి.
ఉత్పాదక పెంచడానికి వ్యవసాయ పరిశోధన కేంద్రాలు ఆవిష్కరిస్తున్న నవీన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు ఆచరణలోకి తీసుకువస్తున్నారు. గత కొన్నేళ్ళలో వ్యవసాయ పరిశోధన ద్వారా 1957 కొత్త వంగడాలు, వాతావరణ మార్పులను తట్టుకోగల 286 కొత్త వంగడాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారని మంత్రి వెల్లడించారు.
Freight Corridor: డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌పై సర్వే
తాజావార్తలు
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
-
Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
-
AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
-
Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ ‘డెడ్ డ్రాప్’ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
-
Mohammed Siraj: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!