MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ పై సిట్ గ్రౌండ్ ఆఫ్ అరెస్ట్ కీలక అంశాలు పేర్కొంది. స్కాంలో మిథున్ రెడ్డి నేరం చేసినట్టు ప్రాథమికంగా గుర్తించాం.. కుంభకోణం మొదలు నుంచి అమలు వరకు మిథున్ రెడ్డి ప్రధాన కుట్రదారుగా ఉన్నారు.. కేసులో ఏ3గా ఉన్న ప్రభుత్వ ఉద్యోగి సత్య ప్రసాద్ కు నాన్ కేడర్ ఐఏఎస్ పదోన్నతి కల్పిస్తానని హామీ ఇచ్చి కుట్ర అమలు చేయించారు అని సిట్ తెలిపింది. స్కాం అమలు కోసమే సత్య ప్రసాద్ ను ప్రత్యేక అధికారిగా నియమించారు.. కేసులో ఏ2 వాసుదేవ రెడ్డి, ఏ3 సత్య ప్రసాద్ లను నేరుగా మిథున్ రెడ్డి ప్రభావితం చేశారు.. ఈ ఇద్దరు గత ప్రభుత్వ హయంలో ఎక్సైజ్ శాఖలో కీలక పొజిషన్ లో ఉన్నారు.. రాష్ట్ర ఆదాయానికి భారీ నష్టం చేకూరే విధంగా వారికి మిథున్ రెడ్డి సూచనలు చేశారు అని సిట్ పేర్కొంది.
Read Also: Gandra Venkata Ramana Reddy: సీఎం రేవంత్ రెడ్డి పగటికలలు కనడం మానుకోవాలి!
అయితే, స్పై ఆగ్రో, శాన్ హాక్ లాబ్స్, డికార్డ్ లాజిస్టిక్ సంస్థలకు లిక్కర్ స్కాం ముడుపులు మళ్ళించారు అని సిట్ తెలిపింది. మిథున్ రెడ్డి సొంత సంస్థ PLR ప్రాజెక్ట్ కి రూ. 15 కోట్లు జమ అయ్యాయి.. డియర్ లాజిస్టిక్ నుంచి PLR ప్రాజెక్ట్ కి రూ. 25 కోట్లు వెళ్ళాయి.. మనీ ల్యాండరింగ్ జరిగిన అంశంపై మరింత విచారణ చేపట్టాల్సి ఉంది.. ఈ డబ్బు మళ్లింపులో కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసీ రెడ్డి ఆయన పీఏ ఏ9గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి పర్యవేక్షించారు.. 2024 ఎన్నికల్లో అనేక నియోజకవర్గాల్లో రాజకీయ ప్రయోజనం కోసం డబ్బు ఖర్చు చేశారని చెప్పుకొచ్చింది. లిక్కర్ స్కాంలో వసూలు చేసిన డబ్బును ఎక్కడకు మళ్లించారనేది మిథున్ రెడ్డికి తెలుసు.. మద్యం సిండికేట్ సభ్యులతో కలిసి వసూల్ చేసిన కమిషన్లు, ముడుపుల డబ్బును రాజకీయ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు ఆర్ధిక లాభం చేకూర్చారని సిట్ వెల్లడించింది.