NTV Telugu Site icon

Margani Bharat: పవన్‌కు ఎంపీ భరత్ సవాల్.. 175 సీట్లకు పోటీ చేస్తారా?

Margani Bharat To Pk

Margani Bharat To Pk

MP Margani Bharat Challenges Pawan Kalyan: తన వారాహి యాత్రలో భాగంగా.. శుక్రవారం భీమవరంలో నిర్వహించిన బహిరంగ సభలో జనసేనాధినేత పవన్ కళ్యాణ్ ఒక ఛాలెంజ్ చేసిన విషయం తెలిసిందే. ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీతో సై అంటే సై అని ఆయన ఓంపెన్ ఛాలెంజ్ చేశారు. దీనిపై తాజాగా వైసీపీ ఎంపీ మార్గాని భరత్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్.. సై అంటే సై దేనికి? ఏపిలో 175 సీట్లకు పోటీ చేస్తారా? అని డిమాండ్ చేశారు. 175 స్థానాల్లో పోటీ చేస్తే.. ఆ పోటీకి వైసీపీ ‘సై అంటే సై’ అని సవాల్ చేశారు. పవన్ ఒక సినిమా స్టార్ కాబట్టి, ఆయన సభలకు యువత వస్తున్నారని ఎద్దేవా చేశారు. కానీ.. సీఎం జగన్ ఒక పొలిటికల్ స్టార్ అని, అందుకే ఆయనకు ప్రజాభిమానం ఉందని తెలిపారు. పవన్ కేవలం గోదావరి జిల్లాల్లోనే పోటీ చేస్తారా? ఆ జిల్లాలకే పరిమితమా? అని ప్రశ్నించారు. వైసీపీని ఓడించాలని, పవన్‌కి ఎందుకంత కక్ష అని నిలదీశారు. చంద్రబాబు అవినీతి పాలన అందిస్తే, జగన్ మెరుగైన పాలన అందించారని.. చంద్రబాబుకు, జగన్‌కు తేడా గ్రహించాలని ప్రజల్ని సూచించారు.

Guinness World Records : ఒంటిపై మంటలతో పరుగెత్తిన రియల్ హీరో.. హ్యాట్సాప్ బాసూ..

అంతకుముందు కూడా.. సీఎం జగన్ పేరు తలరుచుకుంటేనే కొంతమందికి బీపీ వస్తుందని మార్గాని భరత్ నిప్పులు చెరిగారు. ఇక్కడ బీపీ అంటే.. చంద్రబాబు, పవన్ అని అభివర్ణించారు. పవన్‌కి నిర్దిష్టమైన ఆలోచన లేదని.. రాష్ట్రాభివృద్ధి కోసం గత ప్రభుత్వంలో బాబు, పవన్ గాడిదలు కాశారా? అని మండిపడ్డారు. కనీసం ఓటు హక్కు కూడా ఉందో లేదో తెలియని వారే పవన్ సభలకు వస్తున్నారని తూర్పారపట్టారు. పవన్ సభలకు వచ్చే అల్లరిమూకల్ని చూసి.. సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారన్నారు. దత్తపుత్రుడ్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. కేంద్రం నుంచి సీఎం జగన్ వందశాతం నిధులు సాధిస్తున్నారని.. 2024 ఎన్నికల్లో కేంద్రంలో ఎక్కువ సీట్ల సంఖ్య వైసీపీకి వస్తే, ప్రత్యేక హోదా కూడా లభిస్తుందని పేర్కొన్నారు.

Ee Nagaraniki Emaindi: గ్యాంగ్స్ తో వచ్చి రచ్చ చేస్తున్నారు మైక్…

Show comments