కసింకోటలో పసికందు అనుమానాస్పద మృతి కేసులో చిక్కుముడి వీడింది. పసికందు తల్లి సంధ్యను హంతకురాలిగా నిర్ధారించారు పోలీసులు. తన మతిస్థిమితం బాగోలేదని, ఎందుకు చంపోనో తనకే తెలియదని పోలీసులకు వివరణ ఇచ్చింది తల్లి సంధ్య. కొంతకాలం క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు సంధ్య, అప్పలరాజు. అయితే ఇటీవల వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఇక నిన్న అర్ధరాత్రి 12 గంటలకు 37 రోజుల బాబును తీసుకెళ్లి వరండాలో ఉన్న డ్రమ్ములో సంధ్య ముంచేసింది. అనంతరం తనకేమీ తెలియనట్లు బాబు కనిపించట్లేదని నాటకం ఆడింది. కానీ పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా నిజనిజాలు వెల్లడించింది తల్లి సంధ్య. దాంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.