పదవి కోసం ‘జయప్రదం’గా అద్భుతంగా నటిస్తున్నావు చంద్రబాబు అని ట్విట్టర్ లో టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. మాధవరెడ్డి పేరు ఎత్తగానే పెడబొబ్బలు సోకాలు పెడుతున్నావు. మరి నీ పుత్రరత్నం పప్పు నాయుడు మమ్మలిని అందరినీ సోషల్ మీడియాలో క్యారక్టర్ అససనేషన్ చేసినప్పుడు ఏమైంది నీ పెద్దరికం ఇంగితజ్ఞానమ్ అని అడిగారు. చంద్రబాబు… మా అందరివి కుటుంబాలు కావా… మా అందరివి సంసారాలు కావా… మా భార్య పిల్లలు భాదపడరా అని అడిగారు. నిన్ను పల్లెత్తు మాట అనగానే ఆస్కార్ లెవెల్ యాక్షన్ చేస్తున్నావు. ఆస్కార్ జ్యూరీ వాళ్ళు నీ నటన చూసి ఆస్కార్ అవార్డు నీకు పోస్ట్ లో పంపిస్తారులే… ఇంకా ఆపు నీ నటన. ఊరికే ఏడ్చే మగాడిని నమ్మకూడదు అని పెద్దలు అంటుంటారు. అది నీ లాంటి వాడిని చూసి చెప్పి వుంటారు అని వల్లభనేని వంశీ పేర్కొన్నారు.