Srikakulam Rains: చిగురుటాకులా వణుకుతోన్న శ్రీకాకుళం.. విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srikakulam Rains: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా పలాసలో 100.75 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్ ఆదేశాల మేరకు అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలు సహా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవు ప్రకటించారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వర్షాల నేపథ్యంలో విద్యార్థులు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని సూచించారు.
Also Read
- Virat Kohli Birthday: 38వ ఏడాదిలోకి అడుగుపెట్టిన 'రన్ మెషిన్'.. కోహ్లీ 38 అరుదైన రికార్డులు ఇవే..
- గేమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. డిసెంబర్ 10న BGMI Air విడుదల.. 1.4 కోట్ల రిజిస్ట్రేషన్లతో రికార్డు..!
- AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎన్నికలు బహిష్కరించిన గ్రామస్తులు!
- Jio Unlimited 5G Data: జియో బంపర్ ఆఫర్.. రూ.15 రీఛార్జ్‌తో రోజంతా అపరిమిత 5G ఇంటర్నెట్.!
ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరద ప్రవాహాలతో శ్రీకాకుళం జిల్లాలోని తోటపల్లి ప్రాజెక్టు వద్ద నీటిమట్టం పెరుగుతోంది. ప్రాజెక్టుకు వచ్చే ఇన్‌ఫ్లో ఆధారంగా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే సెప్టెంబర్ 24 నాటికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నాగావళి, వంశధార నదుల నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇన్‌ఫ్లోకు అనుగుణంగా నీటిని ఔట్‌ఫ్లో రూపంలో సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
తీవ్ర వాయుగుండం ప్రభావంతో సముద్రంలో పరిస్థితులు కూడా ప్రతికూలంగా మారుతున్నాయి. దీంతో జిల్లాలోని పోర్టుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తీర ప్రాంతాల్లో అధికారులు ప్రత్యేకంగా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వర్షాలు, వరదలు, నదుల ప్రవాహం, తీర ప్రాంత పరిస్థితులపై జిల్లా ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే స్పందించేలా యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచారు.
జిల్లాలోని 11 తీర ప్రాంత మండలాలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్ అప్రమత్తం చేశారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని.. సముద్రం, నదులు, వాగులు, వరద నీటి ప్రవాహాల వైపు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా మొత్తం వణికిపోతోంది. ముఖ్యంగా కళింగపట్నం–గోపాలపురం మధ్య తీరం దాటే అవకాశం ఉండటంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజలకు అవసరమైన సూచనలు జారీ చేస్తున్నారు.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎన్నికలు బహిష్కరించిన గ్రామస్తులు!
-
Virat Kohli Birthday: 38వ ఏడాదిలోకి అడుగుపెట్టిన ‘రన్ మెషిన్’.. కోహ్లీ 38 అరుదైన రికార్డులు ఇవే..
-
గేమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. డిసెంబర్ 10న BGMI Air విడుదల.. 1.4 కోట్ల రిజిస్ట్రేషన్లతో రికార్డు..!
-
Sachin-Joe Root: అత్యధిక టెస్టు రన్స్ రికార్డుకు చేరువవుతున్న జో రూట్.. మనసులో మాట భయపెట్టిన సచిన్!
-
Explainer: UN రిపోర్ట్.. ఆ మరణాల్లో భారత్ టాప్!
ట్రెండింగ్
-
Jio Unlimited 5G Data: జియో బంపర్ ఆఫర్.. రూ.15 రీఛార్జ్‌తో రోజంతా అపరిమిత 5G ఇంటర్నెట్.!
-
WPL 2027 Schedule: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. WPL 2027 షెడ్యూల్ విడుదల.. మ్యాచ్‌ల తేదీలు, వేదికల వివరాలివే..!
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!