MLA Prasanna Kumar Shocking Comments On Chandrababu Naidu: వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. నెల్లూరు జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అంత అబద్దాలకోరు, పచ్చి మోసగాడు, నరరూప రాక్షసుడు ఈ దేశ చరిత్రలో ఉండదరని ఆరోపించారు. 2014లో 600కు వాగ్ధానాలు చేసి, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాడని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసగించారని దుయ్యబట్టారు. మూడు రోజుల పాటు రాజమహేంద్రవరం (రాజమండ్రి)లో అబద్ధపు వరాలు కురిపించాడని విమర్శించారు. మహానాడు వేదిక మీద పెద్ద నాటకాల రాయుడుగా డ్రామాలాడాడని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాను సీఎం జగన్ తాకట్టు పెట్టారని విమర్శించే చంద్రబాబు.. కేంద్రంతో అధికారం పంచుకున్నపుడు ఆ హోదాను ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు.
Odisha train tragedy: గూడ్స్ రైలులో ఇనుప ఖనిజం.. అందుకే ప్రమాద తీవ్రత పెరిగింది..
రెండు ఎకరాల ఆస్తి ఉన్న చంద్రబాబుకు.. ఈరోజు నాలుగు లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ నిలదీశారు. చంద్రబాబు ఎన్ని వేషాలు వేసినా, ప్రజలు ఆయన్ను నమ్మరని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి అవుతానని చంద్రబాబు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. దత్తపుత్రుడు వస్తున్నాడు, వారాహి తీసుకొస్తున్నాడు, అందరం కలుస్తున్నామమని చంద్రబాబు చెప్తున్నాడని పేర్కొన్నారు. ఎంతమంది కలిసొచ్చినా.. ఆంధ్ర రాష్ట్రానికి జగన్‌మోహన్ రెడ్డి 25 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. ఇది ప్రజల ఆశీర్వాదమని, దీన్ని ఎవరూ ఆపలేరని ఉద్ఘాటించారు. బాబు చుట్టూ ఉండే కమ్మ సామ్రాజ్యం తప్ప.. తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తల్ని బాగుపరిచారా? అని అడిగారు. నీ దత్తపుత్రుడుతో కలిసి వారాహి ఎక్కినా.. సీఎం జగన్ వెంట్రుక కూడా పీకలేరని ఛాలెంజ్ చేశారు.
Kurnool Pregnancy Case: యువతి గర్భవతి.. డీఎన్ఏ టెస్ట్ కోరిన యువకుడు.. చివరికి షాక్
అంతకుముందు ప్రసన్నకుమార్ వైసీపీ పార్టీని వీడుతున్నారని ప్రచారాలు వచ్చినప్పుడు.. దీని వెనుక చంద్రబాబు కుట్ర ఉందని ఆయన ధ్వజమెత్తారు. తాను వైసీపీని వదిలే ప్రసక్తే లేదని, చనిపోయే వరకు వైఎస్ జగన్‌తోనే ఉంటానని స్పష్టం చేశారు. కావాలనే ఏదో విధంగా గందరగోళం సృష్టించి.. ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తున్నారని ప్రచారం చేస్తున్నారని, అదంతా అవాస్తవమని అన్నారు. ఒకవేళ తాను చనిపోయినా.. తన కుమారుడు రజత్ కుమార్ రెడ్డి కూడా జగన్‌తోనే ఉంటారన్నారు.