Odisha train tragedy: ఒడిశా బాలాసోర్ వద్ద కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం దేశాన్ని దు:ఖసాగరంలో ముంచింది. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టడంతో ప్రమాదం తీవ్రత అధికంగా ఉంది. ఈ ప్రమాాదంలో 288 మంది మరణించగా.. 1000 మంది గాయపడ్డారు. అయితే ప్రమాదానికి దారి తీసిన క్రమాన్ని రైల్వే బోర్డు ఈ రోజు వివరించింది. ‘‘ఎలక్ట్రానికి ఇంటర్ లాకింగ్ సిస్టమ్’’ సమస్య వల్లే ఈ ప్రమాదం జరిగిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
ఈ దుర్ఘటన జరిగిన బాలాసోర్ లోని బహనాగ బజార్ స్టేషన్ లో నాలుగు లైన్లు ఉన్నాయని, మధ్యాలో రెండు ప్రధాన ట్రాకులకు ఇరువైపు రెండు లూప్ లైన్లు ఉన్నాయని రైల్వే శాఖ వివరించింది. ఈ రెండు లైన్లలో ఐరన్ ఓర్ తో నిండి ఉన్న గూడ్స్ రైళ్లు ఉన్నాయని తెలిపారు. షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ చెన్నై నుండి హౌరాకు వెళ్తుండగా.. బెంగళూర్ నుంచి హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ హౌరా నుండి వస్తోంది. రెండు ప్రధాన ట్రాకుల్లో గ్రీన్ సిగ్నల్ ఉందని, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ గంటకు 128 కి.మీ., మరో రైలు 126 కి.మీ. పరిమితి గంటకు 130 కి.మీ. కాబట్టి వాటిలో ఏదీ ఓవర్ స్పీడ్ కాదని రైల్వే బోర్డు ఆపరేషన్స్ అండ్ డీడీ మెంబర్ జయ వర్మ సిన్హా తెలిపారు.
Read Also: Kurnool Pregnancy Case: యువతి గర్భవతి.. డీఎన్ఏ టెస్ట్ కోరిన యువకుడు.. చివరికి షాక్
సిగ్నలింగ్ లో సమస్య గుర్తించబడిందని, తదుపరి విచారణ తర్వాతే అన్ని వివరాలు వెల్లడవుతాయని ఆమె అన్నారు. ఇంత హైస్పీడ్ లో రియాక్షన్ టైమ్ చాలా తక్కువగా ఉంటుందని ఆమె వెల్లడించారు. సిగ్నలింగ్ వ్యవస్థలో లోపం ఉందని అన్నారు. అయితే ఇది కేవలం ప్రాథమిక అంచనా మాత్రమే అని.. అధికారి విచారణ ముగిసే వరకు ఏమీ చెప్పలేమని రైల్వే బోర్డు వెల్లడించింది. నిజానికి ప్రమాదంలో కొరమాండల్ ఎక్స్‌ప్రెస్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు వెల్లడించారు.
లూప్ లైన్ లోకి వెళ్లిన కొరమాండల్ ఎక్స్‌ప్రెస్, ఐరన్ ఓర్ తో ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టిందని, భారీ బరువుతో ఉన్న రైలును ఢీకొట్టడంతో మొత్తం షాక్ ను గ్రహించిందని ఆమె వెల్లడించారు. దీంతోనే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని ఆమె తెలిపారు. లింకే హాఫ్‌మన్ బుష్ (ఎల్‌హెచ్‌బి) కోచ్‌లు సురక్షితంగా ఉన్నాయన్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ “కవాచ్” అందుబాటులో లేదని రైల్వే తెలిపింది. ప్రపంచంలోని ఏ సాంకేతికత కూడా కొన్ని ప్రమాదాలను నివారించలేదని, వాహనాల ముందు బండరాళ్లు అకస్మాత్తుగా పడిపోవడాన్ని ఉదాహరణగా సిన్హా తెలిపారు.