Minister Vishwarup Health: ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్ (60) శుక్రవారం నాడు వైఎస్ఆర్ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం ఆయన్ను హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్‌కు తరలించారు. ఈరోజు మంత్రి విశ్వరూప్‌ను పరీక్షించిన వైద్యులు శనివారం మధ్యాహ్నం హెల్త్ బులెటిన్‌ను మీడియాకు విడుదల చేశారు.
Read Also: Tamilnadu: కూతురి పిండం అమ్మకానికి పెట్టిన కన్నతల్లి.. పెంపుడు తండ్రితో ఆ పని చేయించి..!!
ప్రస్తుతం మంత్రి విశ్వరూప్ ఆరోగ్యం నిలకడగానే ఉందని హెల్త్ బులెటిన్‌లో వైద్యులు స్పష్టం చేశారు. మంత్రికి స్వల్పంగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని వారు నిర్ధారించారు. ఇప్పటికైతే ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. కాగా ఉన్నట్టుండి మంత్రి విశ్వరూప్ అస్వస్థతకు గురికావడంతో ఆయన అనుచరులతో పాటు వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.
