విశాఖ ఎయిర్‌పోర్ట్ దగ్గర చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి.. విశాఖ గర్జన, పవన్ కల్యాన్ విశాఖ టూర్ సందర్భంగా.. విశాఖ ఎయిర్‌పోర్ట్ దగ్గర మంత్రుల కాన్వాయ్‌లపై దాడులు జరిగాయని ఆరోపిస్తోంది వైసీపీ.. దీనికి జనసేన అధినేత పవన్ కల్యాణే సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు మంత్రి విడదల రజని.. విశాఖ నుంచి గుంటూరు చేరుకున్న మంత్రి.. ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.. విశాఖలో మంత్రులందరి కార్లపై దాడులు చేయటం దారుణమైన విషయం అన్నారు.. విశాఖ గర్జనలో పెద్ద ఎత్తున ప్రజలు మూడు రాజధానులకు మద్దతు తెలిపారన్న ఆమె.. తమ ప్రాంతాన్ని గొప్పగా అభివృద్ది చేసుకునే అవకాశం వచ్చిందని సంతోషపడ్డారన్నారు.. విశాఖ నుండి వస్తుండగా జన సైనికులు పెద్ద ఎత్తున మాపై దాడి చేశారని.. మా కార్లపై కర్రలతో, రాళ్లతో దాడి చేశారని.. దీనికి పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Also: Audimulapu Suresh: పవన్ మాటతీరు వల్లే దాడులు.. చర్యలు తప్పవు..
మూడు రాజధానులకు ప్రజల మద్దతు తెలిసి ముందస్తు ప్లాన్ తో జనసేన మాపై దాడులకు తెగబడిందని ఆరోపించారు మంత్రి విడదల రజని.. ప్రజా స్వామ్యంలో మహిళా మంత్రులపై దాడులు దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు.. మూడు ప్రాంతాలు అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి ఆలోచనకు ప్రజలమద్దత్తు లభిస్తుందని.. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికే ఈ పాదయాత్రలు చేస్తున్నారని ఆరోపించారు.. ఇక, జనసేన కార్యకర్తలు విధ్వంసం సృష్టించాలనే.. మంత్రుల వాహనాలపై దాడులకు తెగబడ్డారని మండిపడ్డారు మంత్రి విడదల రజని.