ఆంద్రప్రదేశ్ అవతరణ దినోత్సవ సందర్భంగా సొమరంగ్ చౌక్ లో పొట్టి శ్రీరాముల విగ్రహానికి పులా మాల వేసి నివాళ్లు అర్పించారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఇతర నేతలు. ఆ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నాడు. విశాఖ ఉక్కు పై కేంద్రం తీసుకున్న నిర్ణయన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడం లేదు. విశాఖ ఉక్కు ప్రవేటికరణ వద్దు అంటు అసెంబ్లీలో సీఎం జగన్ తీర్మానం చేశారు. చంద్రబాబు రాసిన స్క్రిప్ట్ ను పవన్ కళ్యాణ్ చదువుతున్నాడు. జనసేన నాయకులు ఢిల్లీలో ధర్నా చేయలేక విశాఖ గల్లీలో ధర్నా చేస్తున్నారు. బీజేపీతో మాట్లాడే దమ్ము ధైర్యం పవన్ కళ్యాణ్ కు లేదు. పాచిపోయిన లడ్డులని మోడీ పై పవన్ కళ్యాణ్ గతంలో విమర్శలు చేసారు అవి ఇప్పుడు బంగారు లడ్డులు అయ్యాయ్యా అని ప్రశ్నించారు. అయితే పవన్ కళ్యాణ్ కు మతి స్థిమితం లేదు ఏమో చెప్పిన ఆయన సినిమాలో వకిల్ సాబ్, గబ్బర్ సింగ్ కావచ్చు కానీ రాజకీయ జీవితంలో పసలేని నాయకుడు పవన్ కళ్యాణ్. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి పవన్ కళ్యాణ్ ను ఎవరు పిలిచారు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒక్క కార్పొరేటర్ సీటు కూడా రాలేదు సిగ్గు మాలిన రాజకీయాలు చేయడం పవన్ కళ్యాణ్ కు అలవాటే అని పేర్కొన్నారు.