పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. మంత్రులపై దాడి కేసులో ఇప్పటికే జన సేన కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై పవన్ కూడా స్పందించారు. విశాఖలో పోలీసుల దురుసు ప్రవర్తనన చాలా దురదృష్టకరం…జనసేన ఎల్లప్పుడూ పోలీసులను ఎంతో గౌరవిస్తుంది.. జనసేన నేతలను అరెస్టు చేయడం దారుణం…డీజీపీ జోక్యం చేసుకుని జనసేన నేతలను విడుదల చేయాలి…లేదంటే నేనే పోలీసు స్టేషనుకు వచ్చి మా నేతలకు సంఘీభావాన్ని తెలుపుతానన్నారు పవన్ కళ్యాణ్. ఇటు మంత్రి రోజా కూడా ఎవ్వడినీ విడిచిపెట్టను… దాడి చేసింది ఎవరో తమ దగ్గర ఆధారాలున్నాయన్నారు.