Minister Roja: హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. ఈ వీడియోపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ వీడియోపై మంత్రి రోజా స్పందించారు. అసలు ఎంపీ మాధవ్ వీడియో.. నిజమో కాదో తెలుసుకోకుండా టీడీపీ నేతలు విమర్శలు చేయడంపై మంత్రి రోజా అసహనం వ్యక్తం చేశారు. ఈ వీడియో ఘటనపై ఎంక్వయిరీ జరుగుతోందని.. అప్పుడు అంత తొందర దేనికి అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా టీడీపీ, జనసేన నేతలు తన జపం చేస్తున్నారని.. తన మీద వారికి ఎంత ప్రేమ ఉందో దీన్ని బట్టి అర్ధం అవుతోందని మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. కాయలు ఉన్న చెట్టుకు రాళ్ల దెబ్బలు తప్పవన్నారు. ప్రజల ఆశీస్సులతో తాను మంత్రి కావడం చూసి టీడీపీ నేతలు జెలసీ ఫీలవుతున్నారని రోజా చురకలు అంటించారు.
Read Also: Satyanarayana Swamy Vratam: పంతుళ్లు కూడా అప్డేట్ అవుతున్నారా? ఇంగ్లీష్‌లో సత్యనారాయణస్వామి వ్రతం
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎంతోమంది మహిళలపై దారుణమైన ఘటనలు జరిగాయని.. వాటిపై గత ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవని మంత్రి రోజా ఆరోపించారు. నారాయణ స్కూలులో ఎంతో మంది ఆడపిల్లలు చనిపోయారని.. ఈ ఘటనలకు సంబంధించి ఒక్క కేసు కూడా పెట్టలేదని విమర్శలు చేశారు. మహిళలకు ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే జగన్ వదిలిపెట్టరని.. సీరియస్ యాక్షన్ తీసుకుంటారని మంత్రి రోజా తెలిపారు. మరోవైపు తాను కారు కొనుగోలు చేయడంపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తుండటాన్ని మంత్రి రోజా తప్పుబట్టారు. తాను కారు కొనుగోలు చేస్తే అది రిషికొండ గిఫ్ట్ అంటూ ప్రచారం చేస్తున్నారని.. ప్రస్తుత రోజుల్లో చిన్న యాంకర్లు, చిన్న చిన్న నటీనటులు కూడా కారు కొంటున్నారని.. అయినా తాను కారు కొనడం గొప్పేమీ కాదని.. ఈ విషయంపైనా టీడీపీ నేతలు విషప్రచారం చేస్తున్నారని మంత్రి రోజా మండిపడ్డారు. జబర్దస్త్ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నానో బ్యాంక్ లావాదేవీలు చూస్తే తెలుస్తుందని. చదువురాని వారికి సమాధానం చెప్పాల్సిన పని లేదని రోజా సమాధానం ఇచ్చారు.
కాగా జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేతలకు మంత్రి రోజా ప్రత్యేకంగా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ప్రాచీన భారతీయత కళకు ప్రతిరూపం.. గౌరవం, మన్నన తెచ్చే మన చేనేత వస్త్రం.. జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ఆమె ట్వీట్ చేశారు. నిండైన భారతీయతకు నిజమైన అర్థాన్నిచ్చే చేనేత వస్త్రాలను ధరిద్దామని మంత్రి రోజా పిలుపునిచ్చారు.
నిండైన భారతీయతకు నిజమైన అర్థాన్నిచ్చే చేనేత వస్త్రాలను ధరిద్దాం…
నేతన్నలకు చేయూతనిద్దాం జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు #NationalHandloomDay #NationalHandloomDay_2022 pic.twitter.com/HDSyx4mG6i— Roja Selvamani (@RojaSelvamaniRK) August 7, 2022